calender_icon.png 25 December, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి గ్రామంలోనూ మహిళా భవనాలు

25-12-2025 02:13:54 AM

రూ.10 లక్షల వ్యయంతో నిర్మాణాలు

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి) : గ్రామీణ మహిళల ఆర్థిక, సా మాజిక సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాలు, ఫెడరేషన్లకు శాశ్వత వేదికగా నిలిచే భవనాల నిర్మాణానికి సవరించిన మార్గద ర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. గ్రా మస్థాయిలో మహిళా సంఘాల బలోపేతానికి ఇది చారిత్రాత్మక ముందడుగు అని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృ ద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్, గ్రామీ ణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసిం ది.

గ్రామ స్థాయిలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతో గ్రామ సంస్థలు(వీవోలు), ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ల కోసం శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలని మహిళా స్వయం సహయక సంఘ సభ్యులు ప్రభుత్వానికి ఎంతో కా లంగా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్కో భవనానికి రూ.10 లక్షల వరకు వ్యయం చేయనున్నారు. 200 గజాల్లో, కనీసం 552 చదరపు అడుగుల్లో భవనం ఉండేలా డిజైన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క స్పంది స్తూ మహిళలకు గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీతక్క స్పష్టం చేశారు.