16-12-2025 12:00:00 AM
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 15 (విజయక్రాంతి) : మండలంలోని గోలిలింగాల, పోచారం గ్రా మ సర్పంచులు బుర్రకాయల రోజా, సంజీవ రావులు మరియు వా ర్డు మెంబర్లు సర్పంచ్గా గెలుపొందిన సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మె ల్యే మదన్మోహన్రావును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సర్పంచులకు,వార్డు మెంబర్లకు శాలువాలు కప్పి సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ...గ్రామ ప్రజల మధ్య నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.గోలిలింగాల, పోచారం గ్రామాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బుర్రకాయల రోజా,సంజీవరావు,వార్డ్ మెంబర్లు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివకుమార్,సురేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.