calender_icon.png 23 July, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా బోనాల ఉత్సవాలు

21-07-2025 01:38:35 AM

మల్కాజిగిరి, జులై 20 : బోనాల పండుగ పర్వదిన వేడుకలను మల్కాజిగిరి ప్రజలు ఆదివారం భక్తిశ్రద్దలతో కన్నుల పండువగా జరుపుకున్నారు. సుధూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనం, నైవేద్యం, సాక సమర్పించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని మొక్కుకున్నారు.

త తొమ్మిది రోజులుగా ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించిన భక్తులు పర్వది నాన అమ్మవారికి బోనాలు సమర్పించి తమ భక్తి ప్రవత్తులను చాటుకు న్నారు. మల్కాజిగిరి లోని అన్ని దేవాలయాలలో పోలీస్ బందోబస్తు నడుమ పలు ప్రధాన దేవాలయాలతో పాటు కాలనీలో ఉన్న ఆలయాలలో వేలాది మంది భక్తులతో క్రిక్కిరిశా యి. గంటల తరబడి క్యూలో నిలబడి మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు.

మల్కాజిగిరి నియోజకవర్గం లోని పలు ఆలయాల్లో ఆషాడ మాసం బోనాల పండుగ సందర్బంగా కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్, బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి అమ్మ వార్ల బోనాల జాతరలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మల్కాజిగిరి ఎమ్మె ల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ సునీత రాము యాదవ్, టీఆర్‌ఎస్ నాయకులు జగదీష్ గౌడ్ తదితరులు బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.

బోనాల పండుగ సందర్బంగా మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజిగిరి ఉజ్జయిని మహం కాళి ఆమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు కార్పొరేటర్ నీ సన్మానించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ  అమ్మవారి ఆ ఆశీస్సులు మల్కాజిగిరి డివిజన్ లోని  ప్రజలందరిపై ఉండాలని, అంద రు భక్తి శ్రద్ధలతో అమ్మవారి బోనాల పండు గ జరుపుకున్నారు అని చెప్పుకొచ్చారు.

అమ్మవారిని దర్శించుకున్న ఈటల

బోనాలు సందర్భంగా శ్రీశ్రీశ్రీ విజయదుర్గ కట్ట మైసమ్మ దేవాలయంలో ప్రత్యక పూజలు నిర్వహించారు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. ఈ పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ మీన ఉపేందర్ రెడ్డి, మురళి యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, మహిపాల్ రెడ్డి, సూరి, లక్ష్మణ్, బీజేవైఎం సాయి, తదితరులు పాల్గొన్నారు.

కాప్రాలో.. 

కాప్రా: కాప్రా సర్కిల్ పరిధిలోని అన్ని దేవాలయాలో ఆదివారం బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకు న్నారు. మహిళలు బోనాలతో డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి నల్లపోచమ్మ, ము త్యాలమ్మ అమ్మవార్లకు బోనం, మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కుషాయిగూడ పోచమ్మ ఆలయంలో బొంతు దంపతులు పాల్గొన్నారు. మీర్‌పేట హౌసింగ్ బోర్డు డివిజన్ ఇందిరానగర్ కాలనీలో కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్‌రెడ్డి ఉల్లెం బాలరాజు, నవీన్ గౌడ్, సంతోష్, శేఖర్ గౌడ్, దండెం నరేందర్ పాల్గొన్నారు.