calender_icon.png 22 September, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాహక్కు చట్టాన్ని సవరించాలి

22-09-2025 01:06:03 AM

  1. టెట్ నుంచి టీచర్లకు మినహాయింపునివ్వాలి
  2. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరిన టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డితో కలిసి ఆదివారం ఆయన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని  కలిసి వినతిపత్రం సమర్పించారు. వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23(2)ను సవరిస్తూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా పలు విద్యారంగ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో పీఆర్టీయూటీఎస్ మేడ్చల్ జిలా ప్రధానకార్యదర్శి ఆనంద్ రెడ్డి, నాయకులు నవీన్ రెడ్డి, గిరిధర్ తదితరులున్నారు.