calender_icon.png 21 July, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనం ఎత్తుకున్న పోచారం

21-07-2025 12:54:56 AM

బాన్సువాడ, జూలై 20 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా న్సువాడ పట్టణ గౌడ సంఘం, తాడ్కోల్ 2BHK కాలనీ, ప్రెస్ కాలని, కోటగల్లి లోని అన్ని కులస్థుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు.

ఆషాఢ మాసం బోనాల పండుగలో   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు  పోచారం శ్రీనివాస రెడ్డి,రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్  కాసుల బాలరాజు బోనాల ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు.బోనాల పండుగ ఉత్సవాలలో పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజా ప్రతినిదులు, అమ్మ వారి భక్తులు పెద్ద ఎత్తున బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు