calender_icon.png 27 December, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బురదమయంగా రోడ్డు.. రైతులకు ఇబ్బందులు

27-12-2025 12:27:03 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్26: మండల పరిధిలోని కొమ్మాల గ్రామం నుండి తుంగతుర్తి మండలం బోరబండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో గల కుమ్మరివారి కుంట సమీపంలోని అలుగు మీదుగా వెళ్లే రహదారి పూర్తిగా బురదతో నిండి రోడ్డు అద్వాన్నంగా మారడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ రహదారి మీదుగా ప్రతిరోజూ వందలాది మంది రైతులు,రైతు కూలీలు పొలాలకు వెళ్లడం, పొలంలో పండిన ధాన్యాన్ని ఈ దారి గుండానే తరలించాల్సి ఉంది. ఈ దారి గుండా ప్రయాణించాలంటే ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలు బురదలో దిగబడడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు వాపోతున్నారు.తక్షణమే అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందిం చి కల్వర్టు నిర్మాణం చేసి,ప్రయాణాన్ని సులభతరం చేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.