27-12-2025 12:26:02 AM
నకిరేకల్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతాసుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో,శాంతియుతంగా జీవించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆకాంక్షించారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి34వ మండలపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వామివారిని ప్రత్యేకపూజలు నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలపూజ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు యువతలో క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందిస్తాయని, సమాజంలో ఐక్యతను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా గాయని వేముల పుష్ప, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగొని రజిత శ్రీనివాస్, కౌన్సిలర్ గాజుల సుకన్య, పార్టీ సీనియర్ నాయకులు పన్నాల రాఘవరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.