31-12-2025 12:00:00 AM
వాహనదారులకు,విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు
తూప్రాన్, డిసెంబర్ 30 :తూప్రాన్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో బీటీ రోడ్లు పూర్తిగా అధ్వానంగా తయారయ్యా యి. ప్రయాణికులకు, వాహనదారులకు, స్కూలుకు వచ్చిపోయే విద్యార్థులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తూప్రాన్ మండలంలోని మల్కాపూర్ నుం డి కోనాయిపల్లి పిబి గ్రామానికి వెళ్లే బీటీ రహదారి పూర్తిగా అద్వానంగా తయారయింది. ఎక్కడపడితే అక్కడ గుంతలు ఏర్ప డి కంకర రాళ్లు తేలాయి.
గ్రామంలోని ప్రజానికానికి తీరని అంతరాయం ఏర్పడడమే కా క వాహనాలు ప్రయాణిస్తుండగా రాళ్లు టైర్ల కు తాకి ఎగిరి పడడంతో ఎదురుగా వస్తున్న వాహనాదారులకు తగిలే ప్రమాదం పొంచి ఉంది. పల్లెల్లో రోడ్లన్నీ అధ్వానంగా తయారైనా అధికారులు చూస్తూ ఉండిపోవడమే తప్ప పునరుద్ధరణ పనులను చేపట్టలేక పోతున్నారు. ఇకనైనా ప్రభుత్వ ఉన్నత అధికారులు, ఆర్‌అండ్ బి రోడ్డుకు సంబంధించి న అధికారులు తక్షణమే గ్రామాల్లోని బీటీ ర హదారులకు మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం...
తూప్రాన్ మండలంలోని వెంకటాయప ల్లి, నర్సంపల్లి తండాల సమీపం మీదుగా అటవీ ప్రాంతంలో నుండి గత ప్రభుత్వంలో బీటీ రోడ్డు మంజూరు కాగా రెండున్నర కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులను రెండేళ్ల క్రితం ప్రారంభించారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా వెంకటయపల్లి పరిధిలో నుండి మల్కాపూర్, బేగంపేట వెళ్లే రోడ్డుకు అనుసంధానం చేస్తూ దారి పొడుగునా కంకర పరిచారు. అనివార్య కారణాలవల్ల నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో ప్రభుత్వ నిధులను ఉపయోగించి కంకరపరచి వృధాగా నిలిపివేశారు. ప్రభు త్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.