calender_icon.png 27 July, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల పరిశోదనలో, నిందితులను పట్టుకోవడంలో పోలీస్ జాగిలాల పాత్ర కీలకం

26-07-2025 12:59:05 AM

రాజన్న సిరిసిల్ల: జూలై 25 (విజయక్రాంతి)పోలీస్ జగిలాలు నేర పరిశోధన,భద్రతా చర్యలు,మాదకద్రవ్యాల నియంత్రణ,విపత్తు పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయిని,శిక్షణా సామర్థ్యం వల్ల విభిన్న ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తున్నా మని ఎస్పీ  తెలిపారు.పోలీస్ జగిలాల సంరక్షణలో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో వాటి కోసం నూతనంగా నిర్మించిన గదులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ.విశ్వాసానికి మారు పేరుగా నిలిచే జాగిలాలు పోలీస్ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయిని హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జగిన సమయంలో నిందితులను పట్టించడం,సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించిభారీ ప్రాణ,ఆస్తి నష్టం నివారించడంలో పోలీసు జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయిని అన్నారు.

మాదకద్రవ్యాలు, బాంబులు ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించడంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయిని జిల్లాలో అనేక కేసులను ఛేదించడంలో మరియు ఆధారాల సేకరణలో వీటి పనితీరు ప్రశంసనీయమైనది అని అన్నారు. పోలీస్ జగిలాలకు అధునాతన శిక్షణ,వైద్య సంరక్షణ,మరియు తగిన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు.

ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నాలుగు జగిలాలు ఉన్నాయని, వీటి నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన హ్యాండ్లర్స్ ఉన్నారని వెల్లడించారు.వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు కృష్ణ, మొగిలి, నటేష్,ఆర్.ఐ లు రమేష్,యాదగిరి,ఎస్.ఐ లు,ఆర్.ఎస్.ఐ లు, డాగ్స్ హ్యాండ్లర్స్ కార్తీక్,సురేష్, శ్రీనివాస్, కిరణ్,సిబ్బందిపాల్గొన్నారు.