16-12-2025 01:32:23 AM
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు మోత్కుపల్లి రాములు
మొయినాబాద్, డిసెంబర్ 15 (విజయ క్రాంతి): గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు ఎంతో కీలకమని, సర్పంచులు పాలకవర్గంతో గ్రామాలను అభివృద్ధి చేయవలసిందిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు మోత్కుపల్లి రాములు అన్నారు. సోమవారం మండల పరిధిలోని మోత్కుపల్లి, చందనగర్ గ్రామాల నూతన సర్పంచులను ఆయన ఘనంగా సన్మానించారు.
మోత్కుపల్లి నూతన సర్పంచ్ సంపూర్ణ రాములు, చందానగర్ సర్పంచ్ మురళి కృష్ణలను ఆయన సన్మానించి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాలకు సర్పంచులు ఎంతో అవసరమని తెలిపారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు సర్పంచులు పాలకవర్గంతో కలిసి కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే ఈ గెలుపుకు మలుపు అని అన్నారు. గ్రామాలలో ఉన్న సమస్యలను గెలుపొందిన సర్పంచులు అభివృద్ధి చేసినప్పుడే ప్రజలు గుర్తించి ఆదర్శంగా అభినందిస్తారని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు చేసినప్పుడే సన్మానాలు అందుకుంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, పూజారి రవి, చారి తదితరులు పాల్గొన్నారు