calender_icon.png 5 August, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోస్టర్ విధానంతో మాలలకు తీరని అన్యాయం

02-08-2025 12:46:34 AM

  1. మెడిసిన్,ఇంజనీరింగ్ సీట్లలో రోస్టర్ విధానం తీసివేయాలి

విద్యార్థుల జీవితాలు అంధకారంగా మారే ప్రమాదం

ప్రభుత్వం పునరాలోచించి 99 జీవో రద్దు చేయాలి

జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు,తోటమల్ల రమణమూర్తి

చర్ల, ఆగస్టు 1,(విజయక్రాంతి) : మాల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మార్చే ఏకపక్ష రోస్టర్ 99 జీవోను వెంటనే రద్దు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్య క్షులు తోటమల్ల రమణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎస్సీ వర్గీకరణకు ఆమో దం తెలుపుతూ గత సంవత్సరం 2024లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం,

తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసి మాలల ఉనికే ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి వచ్చేలా విడుదల చేసిన ఏకపక్ష రోస్టర్ 99 జీవో ను రద్దు చేయాలంటూ జాతీయ మా ల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధా కర్ ఆగస్టు 1న సామాజిక విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మాల మహానాడు చర్ల మండల కమిటీ ఆ ధ్వర్యంలో మండల అధ్యక్షులు తోటమల్ల గోపాలరావు అధ్యక్షతన మండల కేంద్రం లోని అంబేద్కర్ సెంటర్ లో నిరసన కార్య క్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణ మూర్తి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.అనంతరం జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రోస్టర్ 99 జీవో వల్ల మాల జాతి నిర్వీర్యమే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.వి ద్యార్థుల జీవితాలు భవిష్యత్తు అంధకారంగా మార్చే ఏకపక్ష రోస్టర్ 99 జీవోని వెంటనే ర ద్దు చేయాలని, ఎస్సీ 3 క్యాటగిరి రోస్టర్ పా యింట్లను తగ్గించాలని, తక్షణమే ఉద్యోగ ప్ర మోషన్లు ఆపాలని, మెడికల్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లలో రోస్టర్ విధానాన్ని ఆపి 99 జీవోని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు.ఏకపక్షంగా మాలల ఉనికి లే కుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు.

వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరా ఆలోచన చేసి 99 జీవో ను రద్దు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జాతీ య మాల మహానాడు సీనియర్ నాయకు లు తడికల లాలయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయు లు కొంగూరు నరసింహారావు, దొడ్డా ప్రభు దాస్, మండల గౌరవాధ్యక్షులు మోతుకూరి ప్రభాకర్, నియోజకవర్గ నాయకులు తోట మల్ల విజయ రావు,రుంజా సుమన్,రుంజా రాజా, పాగా రాంప్రసాద్, సోషల్ మీడియా జిల్లా ఇన్ చార్జ్ బోళ్ల వినోద్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ నిట్ట అబ్బులు, నాయకులు తోటమల్ల కృష్ణారావు, కొం గూరు సత్యనారాయణ, జెట్టి వెంకటే శ్వర్లు, తోకల లక్ష్మణరావు, మాదరి శ్యామ్, శెట్టిపల్లి గణేష్, మంచాల బాలు తదితరులు పాల్గొన్నారు.