02-08-2025 12:47:59 AM
పొలంలో నాటు వేసి.. కూలీలతో కలిసి భోజనం చేసి
టేకులపల్లి, ఆగస్టు 1, (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. మండలంలోని పెగాళ్లపాడు, రాంపురం, కొత్తతండా (పీ), తావుర్యతండా, తడికలపూడి, టేకులపల్లి, దాసుతండ, గో ల్యాతండా, బేతంపూడి, తొమ్మిదో మైల్ తండా, రాళ్ళపాడు గ్రామాల్లో పర్యటించా రు. పండగ వాతావరణంలో ఇందిరమ్మ ఇం డ్లకు శంకుస్థాపన చేయగా, ప్రజలు హార తులతో ఘన స్వాగతం పలికారు.
లబ్ధిదా రులు ఎమ్మెల్యేని శాలువాతో సన్మానించిగా ఎన్నో ఏళ్లుగా నెరవేరని పేదోని సొంత ఇం టి కల నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఎ మ్మెల్యే పర్యటనలో భాగంగా సిఎంఆర్ ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు వారి గ్రామంలోనే అందజేశారు. బేతంపూడి గ్రామం నందు పొలంలో ట్రాక్టర్ నడుపుతూ స్వయంగా వారే దమ్ము చేసి వ్యవసాయ కూలీలతో కలిసి వరినాటు వేసి మందు చల్లారు.
అ నంతరం రైతు కూలీలతోపాటు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియో జకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, మండల అధ్యక్షులు దేవా నా యక్, ఎంపీడీఓ మల్లేశ్వరి, మార్కెట్ చైర్మన్ రాంబాబు, సిఐ బత్తుల సత్యనారాయణ, బోడు ఎస్త్స్ర శ్రీకాంత్, హోసింగ్ ఏఈ గణేష్, పీఆర్ ఏఈ నవీన్, ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్, పీఏసిఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు,
వైస్ చైర్మన్ కంభం పాటి శ్రీనివాస్, మాజీ పీఏసిఎస్ చైర్మన్ దళపతి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకు లు ఈది గణేష్, పోశాలు, రెడ్యానాయక్, లక్కినేని శ్యామ్, భద్రు, బండ్ల రజినీ, మధు రెడ్డి, శంకర్,శ్రీను, బొడ్డు అశోక్, చందర్ సింగ్, అజ్మీర శివ, మూడ్ సంజయ్, ధర్మ య్య, పెరుగు వెంకన్న, సుభాష్ చంద్ర బోస్, గంగారపు కోటేశ్వరావు, రాందాస్, లక్ష్మయ్య, మురళీ, బానోత్ సరోజినీ, సరిలాల్, ము చ్చా సుధాకర్, విజయ్, సక్రు, భూక్యాశంకర్, భూక్యా ఈశ్వర్, మూడ్ గణేష్, తదితరులు పాల్గొన్నారు.