22-01-2026 12:26:36 AM
చేగుంట, జనవరి 21: చేగుంటలో పట్టణ కేంద్రంలో కోతుల బెడద తీర్చాలని, జిల్లా ఫారెస్ట్ అధికారి జోజి కి సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, ఉప సర్పంచ్ మహ్మద్ రఫీ, వార్డు సభ్యులు వినతిపత్రం అందించారు. బుధవారం ఫారెస్ట్ అధికారి జోజిని కలిసి కోతుల వల్ల ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటి బెడద తీర్చాలని చేగుంట సర్పంచ్ స్రవంతిసతీష్, ఉప సర్పంచ్ మొహమ్మద్ రఫీ, సభ్యులు వంశీ, ఆరిఫ్, సుఖేందర్, రవి, లింగం, కె శ్రీనివాస్, శ్రీనివాస్ తెలిపారు.