calender_icon.png 22 January, 2026 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలి

22-01-2026 12:27:35 AM

ఎంఈఓ నీరజ

చేగుంట,జనవరి 21: సోషల్ ఫోరం ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, మండల స్థాయిలో సాంఘిక శాస్త్ర ప్రతిభాపాటవ పరీక్ష నిర్వహించారు. చేగుంట మండల విద్యాధికారి నీరజ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు సాంఘిక శాస్త్ర అధ్యయనం ద్వారా నైతిక విలువలు పెంపొందించుకుంటారని, 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకట నరసింహారావు, రఘుపతి, చల్లా లక్ష్మణ్, యాదగిరి, రవిబాబు, పద్మ, రమ్య శ్రీ , సురేష్, ఝాన్సీ, చేగుంట మండల సోషల్ ఫోరం కన్వీనర్ పెంటా గౌడ్ పాల్గొన్నారు.