calender_icon.png 16 December, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగదేవుపేటలో కొనసాగుతున్న కత్తెర గుర్తు హవా!

15-12-2025 02:04:44 AM

ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్న నూకల కుమార్

వెల్గటూర్,డిసెంబర్14(విజయక్రాంతి): వెల్గటూర్ మండలం జగదేవ్ పేట గ్రామంలో కత్తెర గుర్తు హవా కొనసాగుతోంది. మీ ఓటు వేసి ఆశీర్వదించండి గ్రామ అభివృద్ధి అంటే ఎలా ఉం టుందో చేసి చూపిస్తా అంటూ సర్పంచ్ అభ్యర్థి నూకల కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. జంగల్ నాల ప్రాజెక్టు, వెల్గటూర్ నుండి చర్లపల్లి వరకు రోడ్డు, గ్రామంలో నీటిసమస్య లేకుండా శాశ్వత పరిష్కారం, జగిత్యాల నుండి ఆర్టీసీ బస్సు మూడుసార్లు వచ్చేల కృషి, గ్రంధాలయం ఏర్పాటు , ఓపెన్ జిమ్, క్రీడ మైదానం ఏర్పాటు, ప్రభుత్వ సహకారంతో శాశ్వత అంగ న్వాడి భవనాల ఏర్పాటు, డ్రైనేజిల సమస్యకు శాశ్వత ఏర్పాటు,

వీధి దీపాల ఏర్పాటు, కూడలీల వద్ద ఐమాస్ లైటింగ్ ఏర్పాటుకు కృషి, అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు త్వరగతిన అందేలా కృషి చేస్తామని సర్పంచ్ అభ్యర్థి నూకల కుమార్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు. గ్రామ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందనీ, సమస్యల పరిష్కార సాధనకు సైతం తమదగ్గర పూర్తి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయన్నారు. గ్రామ పెద్దలు,యువకులు,మహిళలు ఆలోచించి తన కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలనీ ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశాడు.