calender_icon.png 8 November, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక క్వారీల కోసం రగడ

08-11-2025 12:28:31 AM

- రెండు సొసైటీ సభ్యుల మధ్య వైరం

- మంత్రి అండతో గుత్తేదారులు ఇష్టారాజ్యం

- గుత్తేదారుల కనుసన్నలతో ఒక సొసైటికే కొమ్ముకాస్తున్న అధికారులు

- న్యాయం చేయాలని కె. కొండాపురం గ్రామానికి చెందిన శ్రీ సీతారామ సొసైటీ సభ్యుల ఆందోళన

- కలెక్టరేట్ ఎదుట బైటాయించి నిరసన..

- జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి.. తగిన చర్యలు తీసుకుంటామని హామీ

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 7, (విజయక్రాంతి):ఇసుక క్యారీల కోసం రగడ మొదలైంది. ఓ వర్గానికి గుత్తేదారులు వంతపాడుతూ.. అధికారులతో పావులు కదుపు తూ ఇసుక క్యారీని తమకు కాకుండా చేయాలని చూస్తూ గిరిజనుల ఆస్తిని కొల్లగొట్టాలని చూస్తున్నారని మరో వర్గం ఆందోళనకు ది గారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం మణుగూరు మండలం కె.కొం డాపురం గ్రామనికి చెందిన శ్రీ సీతారామ సొసైటీ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ఆందోళ న చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ సొసైటీ అధ్యక్షురాలు లావణ్య మాట్లాడుతూ.. గుత్తేదారు లు ఇచ్చే డబ్బులకు ఆశపడి అధికారులు త మకు అన్యాయం చేస్తున్నారని, సొసైటీ రిజిస్ట్రేషన్ మా సొసైటికి చేసి ఆరు నెలలు అవు తున్నా ఇసుక క్యారీని కేటాయించకుండా రెండు వారాల కిందట అక్రమ మార్గంలో స రైన పత్రాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న సొసైటికి కేటాయింపులు చేశారని ఆరోపించారు.

మా సంఘంపై ఉద్దేశపూర్వకంగా లేని పోని అభాండాలు వేస్తూ ఎంక్వైరీల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని, మా సొసైటికి అన్ని అర్హతలు ఉన్నా గుత్తేదారుల కనుసన్నల్లో అధికారులు పనిచేస్తూ మాకు తీరని అన్యాయం చేస్తున్నారని, సొసైటీకి రాజీనా మా చేసిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ రెండు సంఘాలలో కొనసాగుతున్నామని తప్పుడు పత్రాలు ద్వారా ఇసుక క్వారీ మాకు కాకుం డా చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీ ముత్యాలమ్మ ఇసుక క్వారీ పాలక వర్గం రిజిస్ట్రేషన్ లో కె.కొండాపురంతో  పా టు అన్నారం గ్రామాల పేరుతో చేశారని, కా నీ రెవెన్యూ పంచాయతీలు వేరని, కానీ అధికారులు గుత్తేదారుల డబ్బులకు లొంగి కె. కొండాపురం గ్రామానికి చెందిన మాకు కా దని ఇతర గ్రామాలకు, ప్రభుత్వం ఉద్యోగం ఉన్న వారు సభ్యులుగా చేసి రిజిస్ట్రేషన్ చేశారని, ఎంక్వైరీ ఆఫీసర్ స్వప్న ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమకు అన్యాయం చేస్తోందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు విన్నవించగా, ఆయన సానుకూలంగా స్పందిం చారని, సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంక టనర్సమ్మ, జయలక్ష్మి, భారతి, నాగలక్ష్మి, యర్రమ్మ, నర్సమ్మ, వెంకటరమణ, భద్ర మ్మ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.