calender_icon.png 9 November, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ ట్వంటీ సిరీస్ మనదే

09-11-2025 12:00:00 AM

  1. చివరి మ్యాచ్‌లో వరుణుడి ఆట

2 సిరీస్ భారత్ సొంతం

ఆసీస్ గడ్డపై టీ20 సిరీస్‌ల్లో అజేయ రికార్డ్

బ్రిస్బేన్, నవంబర్ 8 : హ్యాట్రిక్ విజయంతో ఆసీస్‌ను చిత్తు చేయాలనుకున్న భారత్ ఆశలకు వరుణుడు అడ్డుపడ్డాడు. బ్రిస్బేన్ వేదికగా చివరి టీ ట్వంటీ వర్షంతో రద్దయింది. ఫలితంగా 2 ఆధిక్యంలో ఉన్న టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా వన్డే సిరీస్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ జోరు మీదు న్న భారత్ తుది జట్టులో ఒక మార్పు చేసింది.

తిలక్‌వర్మకు రెస్ట్ ఇచ్చి రింకూసింగ్‌ను తీసుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ ఫీల్డిం గ్ ఎంచుకోగా.. భారీస్కోర్ చేయాలనే టార్గెట్‌తో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, జైశ్వాల్ దూకుడుగా ఆడారు. ఆసీస్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు అజే యంగా 52 పరుగులు జోడించారు. భారత్ స్కోర్ 52/0(4.5 ఓవర్లు) దగ్గరుండగా అనూహ్యా వాతావరణంతో మ్యాచ్ నిలిచిపోయింది.

విపరీతమైన గాలి వేయడంతో అం పైర్లు ఆటను నిలిపివేశారు. తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం మొదలై చాలా సేపు కురి సింది. ఈ వానకు మైదానం చిత్తడిగా మార డం, జల్లులు తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. దీంతో 2 భారత్ సిరీస్ కైవసం చేసుకోగా.. సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీ అం దుకున్నాడు. సిరీస్‌లో అదరగొట్టిన ఓపెనర్ అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కింది.

ఈ సిరీస్ విజయంతో ఆసీస్ గడ్డపై భారత్ తన అజేయ రికార్డును కొనసాగించింది. 17 ఏళ్లుగా భారత్ అక్కడ టీ20 సిరీస్ కోల్పోలేదు. అలాగే షార్ట్ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా పేలవ రికార్డ్ కూడా కొనసాగింది. గత మూడేళ్లలో కంగారులు నాలుగు సిరీస్‌లను కోల్పోయారు.

2022లో భారత్, ఇంగ్లాండ్ జట్ల చేతిలోనూ, తర్వాత 2023, 2025లలో భారత్ చేతిలోనూ టీ ట్వంటీ సిరీస్‌లలో పరాజయం పాలైంది. కాగా ఈ సిరీస్‌లో తొలి టీ ట్వంటీ వర్షంతో రద్దయింది. రెండో టీ ట్వంటీలో ఆస్ట్రేలియా గెలిస్తే.. తర్వాత భారత్ వరుసగా మూడు, నాలుగు మ్యాచ్‌లలో గెలిచి ఆధిక్యంలోకి నిలిచింది.  

టీ20ల్లో సూర్యకుమార్ రికార్డ్ అదుర్స్

సూర్యకుమార్ యాదవ్ టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్సీ రికార్డ్ అద్భుతంగా సాగుతోంది. ఆసీస్‌పై సిరీస్ విజయంతో ఆరు సిరీస్‌లను ఖాతాలో వేసుకున్నాడు. 2023లో టీ ట్వంటీ కెప్టెన్సీ చేపట్టిన సూర్యకుమార్ తొలి సిరీస్‌లోనే ఆస్ట్రేలియాపై 4 విజయాన్ని అందుకున్నాడు.

తర్వాత సౌతాఫ్రికాపై 1 డ్రాగా ముగించిన సూర్యకుమా వరుసగా శ్రీలంక (3 బంగ్లాదేశ్ (3 సౌతాఫ్రికా (3 ఇంగ్లాండ్ (4 ఆస్ట్రేలియా(2 సిరీస్ విజయాలను సాధించి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. మధ్యలో ఆసియాకప్ విజయం కూడా సూర్యకుమార్ ఖాతాలోనే ఉంది. వచ్చే టీ ట్వంటీ ప్రపంచకప్ వరకూ అతన్నే కెప్టెన్‌గా కొనసాగిస్తారని భావిస్తున్నారు.

అభిషేక్ శర్మ @ 1000 రన్స్

ఈ సిరీస్‌లో 163 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. చివరి టీట్వంటీలో అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ ట్వంటీల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.

ఈ క్రమంలో సూర్యకుమార్‌ను దాటేశాడు. 1000 పరుగులు పూర్తి చేసేందుకు స్కై 573 బాల్స్ ఆడితే.. అభిషేక్ శర్మ 528 బంతుల్లోనే అందుకున్నాడు. అలాగే ఇన్నింగ్స్‌ల పరంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా నిలిచాడు. కోహ్లీ 27 ఇన్నింగ్స్‌లతో అగ్రస్థానంలో ఉంటే.. అభిషేక్ 28 ఇన్నింగ్స్‌లలో 1000 రన్స్ పూర్తి చేశాడు.