calender_icon.png 9 November, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషన్స్ కప్ విజేతగా భారత్

09-11-2025 12:00:00 AM

హైదరాబాద్, నవంబర్ 8 :  ప్రతిష్టాత్మక 60వ ఐజీఎఫ్‌ఆర్ వరల్డ్ గోల్ఫ్ చాంపియన్‌షిప్ ముగిసింది. ఆసియాలోనే తొలిసారిగా హైదరాబాద్ ఆతిథ్యమిచ్చిన ఈ పోటీల్లో నేషన్స్ కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. భారత గోల్ఫర్లు ముకేశ్ సంఘ్వీ, సాజన్ కుమార్ జైన్, అశోక్ దొరైస్వామి అద్భుత ప్రదర్శనతో టైటిల్ అందించారు. తైవాన్ రన్నరప్‌గానూ, స్విట్జర్లాండ్ సెకండ్ రన్నరప్‌గానూ నిలిచాయి.

రొటేరియన్ డివిజన్ హరిణి జితేంద్ర, డివిజన్2లో వర్గీస్ రుబెన్, వెటరన్స్ డివిజన్‌లో గిబ్సన్ పీటర్ విజేతలుగా నిలిచారు. ఓపెన్ కేటగిరీ డివిజన్ రిన్నర్ అలియోస్, డివిజన్‌2లో సంఘ్వి ముకేశ్, డివిజన్ జైన్ సాజన్‌కుమార్ చాంపియన్లుగా నిలిచారు.

ఈ టోర్నీలో ప్రపంచవ్యాప్తంగా 24 దేశాలకు చెందిన 180 మంది గోల్ఫర్లు పాల్గొన్నారు. ఈ టోర్నీతో గోల్ఫ్ క్రీడను ప్రమోట్ చేయడంతో పాటు టూరిజాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించారు. హైదరాబాద్‌లోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించిన విదేశీ గోల్ఫర్లు తెలంగాణ ఆతిథ్యంపై ప్రశంసలు కురిపించారు.