calender_icon.png 7 December, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగం

07-12-2025 12:00:00 AM

తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభం

తైక్వాండో ఛాంపియన్ షిప్ అసోసియేషన్ కోశాధికారి సీహెచ్. మారుతి వరప్రసాద్

ముషీరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): క్రీడాకారుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొం దించడంతో పాటు తనను తాను రక్షించుకునే విధంగా నమ్మకం కలిగే విధం గా తీర్చిదిద్దాలని తైక్వాండో చాంపియన్ షిప్ అసోసియేషన్ కోషాధికారి సీహెచ్ మారుతి వరప్రసాద్ అన్నారు. 2 వ తెలంగాణ స్టేట్ లెవెల్ ఇంటర్ స్కూల్, తైక్వాండో సబ్ జూనియర్ 2025 పోటీలు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం  జరిగాయి.

ఈ సం దర్భంగా ఆయన హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మార్షల్ ఆరట్స్ నేర్చుకోవాలని సూచించారు. ఆత్మరక్షణతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందించుకోవచ్చన్నారు. అనంతరం  మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ పిల్లల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసి వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని వారు అన్నారు.

ప్రతి పోటీల్లో జయాపజయాలు సర్వసాధారణమని, ఓడిపోయా మని కుంగిపోరాదని వారు సూచించారు. మరోసారి ప్రయత్నిస్తే తప్పక విజయం వరిస్తుందన్నారు. ఈ పోటీలలో 400 మంది పాల్గొనగా విజేతలకు మీర్ వహాజ్ అలీఖాన్, మహేశ్వర్, కోమ్మయ్య, మల్లిక, గుర్రం కృష్ణ, నరసింహ, బి. కృష్ణ, సర్టిఫికేట్లను  అందజేశారు.