calender_icon.png 28 May, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వయం ఉపాధిని మెరుగుపర్చుకోవాలి

09-05-2025 02:15:57 AM

ఎమ్మెల్యే బాలునాయక్

దేవరకొండ, మే 08 : స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తెలిపారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నల్లగొండ రోడ్డుకు గురువారం కొత్తగా ఏర్పాటు చేసిన టోయోటా షోరూమ్, విష్ణు షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసి ఎంఎంఆర్ డయాగ్నొస్టిక్ అండ్ క్లీనిక్ను దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత స్వయం శక్తితో ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  నాయిని జమున మాధవ రెడ్డి,సిరాజ్ ఖాన్,డాక్టర్ వేణుధర్ రెడ్డి,వేమన్ రెడ్డి, దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.