18-05-2025 12:27:23 AM
రాష్ట్ర మంత్రిమండలి విస్తరణ, బీజేపీ అధ్యక్ష పదవి భర్తీ.. రెండూ అంతులేని కథలుగా సాగిపోతున్నాయి. ఎప్పుడడిగినా అవి త్వరలో భర్తీ అవుతాయి అని రెండు పార్టీల నేతలు చెబుతూ వస్తున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని.. తమకు అవకాశం వస్తుందని.. అనేక మంది ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు.
కొందరైతే ఏకంగా తమకు ఫలానా మినిస్ట్రీ కూడా కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకుని తిరిగారు. ఇంకొందరైతే తమ సామాజిక వర్గం పెద్దదని నేనొక్కన్నే ఆ వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నానని కాబట్టి నాకు పక్కాగా మంత్రిపదవి వచ్చినట్లేనని ఊహల పల్లకిలో ఊరేగారు.
కానీ అటు అధిష్ఠానం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యులు కానీ ఈ అంశంపై త్వరలో అనే సిగ్నల్ ఇస్తున్నారు కానీ ఎంతకూ భర్తీచేయకపోవడంతో ఆశావహులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇక అచ్చం ఇదే తీరుగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి భర్తీలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. కనీసం పార్టీ అధ్యక్షున్ని నియమించుకోలేకపోతున్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి ఎలా వస్తుందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడటం కొసమెరుపు.
విజయ భాస్కర్