calender_icon.png 26 November, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోగిన పంచాయతీ ఎన్నికల నగారా

26-11-2025 12:00:00 AM

  1. కామారెడ్డి జిల్లాలో మూడు విడుతలలో ఎన్నికలు

532 సర్పంచ్ స్థానాలు, 4,6 56  వార్డు సభ్యుల స్థానాలకు  ఎన్నికలు

ఎన్నికల నిబంధనల అమలు

రిజర్వేషన్లు కలిసి వచ్చినవారు పోటీకి తహతహ 

ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు 

కామారెడ్డి, నవంబర్ 25 (విజయక్రాంతి): ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్  తేదీలను మంగళవారం ప్రకటించడంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసే వారు తహతహలాడుతున్నారు. ఎన్నికలు వాయిదాపడతాయా..?  జరుగుతాయా... అనే ఉత్కంఠతో ఎదురుచూసిన వారికి ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఆశవాహూలు సంబరపడుతున్నారు.

ఇప్పటికే జిల్లా అధికారులు ఓటర్ల జాబితాలను సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల వివరాలను ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను  ఖరారు చేసింది.కామారెడ్డి జిల్లాలో మూడు విడతలుగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

జిల్లాలో మూడు విడు తలలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు 

కామారెడ్డి జిల్లాలో మూడు విడుతల లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సంఘం డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒక దశకు మరో దశకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికలు జరగనుండడంతో ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని జిల్లా అధికారులు ప్రకటించారు.

ఎక్కువ మొత్తంలో డబ్బులు బ్యాంకుల నుంచి డ్రా చేయవద్దని, డబ్బులు కు సంబంధించిన ఆధారం లేకుండా వాహనాల్లో తరలించవద్దని పేర్కొన్నారు. డబ్బులను అనుమతి లేకుండా తరలిస్తే  సిజు చేయబడతాయని తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుందని, అదే రోజు ధ్యానం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కౌంటింగ్ అనంతరం ఫలితాలు ప్రకటించానున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. 

532 జీపీలు, 4,656 వార్డ్ సభ్యులు స్థానాలకు ఎన్నికలు 

కామారెడ్డి జిల్లాలో 25 మండలాలలోని 532 గ్రామపంచాయతీ లకు, 4,6 56 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఆశావాహుల్లో ఉత్సాహం 

సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే ఆశవా హూలు ఉత్సహ కథ వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సర్పంచ్, వార్డు  సభ్యుల ఎన్నికల ను ప్రభుత్వం ప్రకటించడంతో పోటీలో నిలబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల ప్రకటన రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ తెలిపారు. జిల్లాలో మూడు విడుదల లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొ న్నారు. ఆయా పార్టీల, గ్రామాల నాయకులు ప్రశాంతంగా ఎన్నికలు జరిగిందుకు సహకరించాలని కోరారు. పోలీస్ బందోబస్ ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు.