calender_icon.png 16 September, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థలం కబ్జా కాకుండా చూడాలి

16-09-2025 01:02:37 AM

తాహసీల్దార్, డీసీ లకు వినతి

మలక్‌పేట్, సెప్టెంబర్ 14 (విజయ క్రాంతి): తన విలువైన స్థలం కబ్జా కాకుండా తగిన చర్య లు తీసుకోవాలంటూ నూర్ఖాన్ బజార్‌కు చెందిన అష్రాఫ్ ఉన్నిసా బేగం ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నూర్ఖాన్ బజార్ ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో అష్రాఫ్ ఉన్నిసా మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ మండ లం పరిధిలోని పల్లి గ్రామంలో తన భర్త హైమద్ అలీ వారసత్వంగా 252 ఎకరాల స్థ లం ఉందన్నారు.

ఇందులో చాలావరకు అన్యాక్రాంతం అయిపోగా ప్రస్తుతం 25 ఎకరాల వరకు స్థలం ఉందన్నారు. కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోని సర్వేనంబర్ 25/1, 25/2 లో దాదాపు 25 ఎకరాల స్థలం కబ్జా చేసేందుకు కబ్జాదారుల కన్ను పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే స్థలం విషయం వివాదంపై 2016 లో హైకోర్టు న్యాయమూర్తి స్టే విధించారని ఆమె గుర్తు చేశారు. కుత్బుల్లాపూర్ మండల తాహసీల్దార్, పెట్‌బషీరాబాద్ సీఐ, కుత్బుల్లాపూర్ సర్కిల్ డీసీకి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు సరైన విధంగా స్పందించడం లేదంటూ అష్రాఫ్ ఉన్నిసా ఆరోపించారు.