16-09-2025 01:03:52 AM
మేడిపల్లి, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏ రవికుమార్, ఏమ్ వనిత, ఏమ్ కమలాకర్‌లను తెలంగాణ రాష్ర్ట ప్రభు త్వం గ్రామ రెవెన్యూ పాలన నిమిత్తం బదిలీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శైలజ మాట్లాడుతూ బోడుప్ప ల్ ప్రజలకు అందించిన సేవలకు గాను వారిని ప్రశంసించి సాలువ, మెమొంటోలతో సత్కరించారు.
ఇట్టి కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకన్న, అసిస్టెంట్ ఇంజనీర్ రాకేష్, మేనేజర్ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, అకౌంట్స్ అధికారి లక్ష్మి, సానిటరీ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి, పట్టణ ప్రణాళిక అధికారి కావ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంగీత, అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.