24-01-2026 12:23:13 AM
మేడారం, జనవరి 23 (విజయక్రాంతి): సమ్మక్క సారలమ్మ జాతర బందోబస్తు విధు లు నిర్వహిస్తున్న మా ఆకలి తీరుస్తున్నారు.. మీ సేవలు అమోఘమం అంటూ మేడారం మెస్ సిబ్బందికి ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ కితాబిచ్చారు. మేడారంలో గత 15 రోజులుగా బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నటువంటి అధికారులు,సిబ్బందిని ఎస్పీ అభినం దించి సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బందోబస్తు కోసం వచ్చేటువంటి పోలీసులకు మంచి వసతి, భోజనం సదుపాయాలు కల్పించడం మన బాధ్యత అన్నారు. అలా చేయగలిగినప్పుడే అధికారులు, సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వ హిస్తారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏఎస్ పి మనన్ బట్, డీఎస్పీ రవీందర్, పస్ర సిఐ దయాకర్, మేడారం ఎస్ హెచ్ ఓ కమలాకర్ పాల్గొన్నారు.