10-08-2025 12:12:24 AM
విజయనగర సంస్కృతిలో లీనమైన ఆరాధ్య కళలు, హస్తకళలు, శాసనాలతో హంపి పర్యాటక ప్రాంతంగా వెలుగునీలింది. ఇంతటి విశిష్ట చరిత్ర ఉన్న హంపిని 1336 నుంచి 1565 వరకు విజయనగర రాజులు పరిపాలించారు. 1565 తర్వాత విజయనగర సామ్రాజ్యంపై దండెత్తిన బహమనీలు యుద్ధం తర్వాత హంపిని నాశనం చేశారు. అయినప్పటికీ హంపిలోని ప్రసిద్ధ విరూపాక్ష ఆలయం మాత్రం చెక్కుచెదరకుండా ఇప్పటికీ బలంగా నిలవడం విశేషం. ముస్లిం పాలకుల చేతుల్లో చిద్రమైన హంపి చరిత్రను ఒకసారి స్మరించుకుందాం.
భారతదేశ చరిత్రలో అత్యంత అద్భుతమైన రాజ్యాలలో విజయనగర సామ్రాజ్యం ఒకటి. అప్పటి విజయనగర సామ్రాజ్య ప్రధాన రాజధాని హంపి నేడు కర్ణాటకలో భాగంగా ఉంది. విజయనగర శిల్పకళకు హంపి మంచి ఉదాహరణ. రాజభవనాలు, జల నిర్మాణాలు, పురాతన మార్కెట్ వీధులు, బలమైన గోడలు, రాజ మంటపాలు, ఖజానా భవనాలు, స్తంభాలు ఆక్టటుకుంటాయి.
విజయనగర సంస్కృతిలో లీనమైన ఆరాధ్య కళలు, హస్తకళలు, శాసనాలతో హంపి వెలుగునీలింది. ఇంతటి విశిష్ట చరిత్ర ఉన్న హంపిని 1336 నుంచి 1565 వరకు విజయనగర రాజులు పరిపాలించారు. 1565 తర్వాత విజయనగర సామ్రాజ్యంపై దండెత్తిన బహమనీలు యుద్ధం తర్వాత హంపిని నాశనం చేశారు. అయినప్పటికీ హంపిలోని ప్రసిద్ధ విరూపాక్ష ఆలయం మాత్రం చెక్కుచెదరకుండా ఇప్పటికీ బలంగా నిలవడం విశేషం.
ముస్లిం పాలకుల చేతుల్లో పడి చిద్రమైన హంపి చరిత్రను ఒకసారి స్మరించుకుందాం. 14వ శతాబ్దం నాటికి మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీలో సింహాసనాన్ని అధిష్టించాడు. అత్యంత క్రూరుడైన ఇతడు తిరుగుబాటు దార్లపై ఉక్కుపాదం మోపేవాడు. అలా ఒకసారి తుగ్లక్ తన సొంత మేనల్లుడు హంపికి సమపంలోని తుంగభద్ర నది ఒడ్డున ఉన్న అనెగుండి అనే చిన్న రాజ్యంలో తిరుగుబాటు చేశాడన్న సంగతి తెలుసుకున్నాడు.
తుగ్లక్ తన సైన్యాన్ని అక్కడికి పంపి అతడిని చంపించాడు. ఆ తర్వాత ఆ రాజ్యాన్ని హరిహర, బుక్కరాయ అని పిలవబడే సోదరులకు అప్పగించాడు. అలా హంపి కేంద్రంగా పరుడు పోసుకున్నదే విజయనగర సామ్రాజ్యం. ఆ తర్వాత ఈ విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని 200 ఏళ్లకు పైగా ఏకఛత్రాదిపత్యంతో ఏలారు.
తల్లికోట యుద్ధం..
నాణేనికి మరోవైపు అన్నట్టు.. తుగ్లక్ సైన్యంలో కమాండర్ అయిన అలావుద్దీన్ హసన్ బహమనీ షా ఏకంగా తుగ్లక్‌పైనే తిరుగుబాటు చేసి తనకు తాను స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. అలా దక్కన్ సుల్తానేట్ వంశాన్ని స్థాపించాడు. ఆ తర్వాత బహనీయులు.. అహ్మద్ నగర్, బేరార్, బీజాపూర్, బీదర్, గోల్కండ అనే ఐదు దక్కన్ సుల్తానేట్లుగా విడిపోయింది. 16వ శతాబ్దం వచ్చేసరికి విజయనగర సామ్రాజ్యం పూర్తిగా నశించిపోయింది.
అప్పటి విజయనగర పాలకుడు అలియ రామరాయ సుల్తానేట్లతో తరచూ ఘర్షణ పడేవాడు. ఇలా అయితే కుదరదని భావించిన దక్కడ్ సుల్తానేట్లు ఒక కూటమిగా ఏర్పడి విజయనగరం సామ్రాజ్యంపై దండెత్తారు. దీనినే తల్లికోట యుద్ధంగా (రాక్షస తంగడి) అభివర్ణిస్తారు. ఈ యుద్ధంలోనే అలియ రామరాయను చంపి ఆ తర్వాత హంపి నగరాన్ని దోచుకొని పూర్తిగా నాశనం చేశారు. ఆ తర్వాత హంపిలోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసంతో పాటు ప్యాలెస్‌లోకి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలు, నాణేలు దోచుకెళ్లారు. దీంతో పాటు మార్కెట్ల మీద విరుచుకుపడి దోపిడీలు, లూఠీలు చేశారు.
సామాన్య ప్రజలను హింసించడంతో పాటు చంపడం లేదా రాజ్యం నుంచి బహిష్కరించారు. లక్షల మంది ప్రజలు, పర్యాటకులతో సుందర ప్రదేశంగా పేరు పొందిన హంపిని దక్కన్ సుల్తానేట్‌లు తమ దండయాత్రతో బంజరు భూమిగా మార్చేశారు. ఇది కేవలం నగరం పతనం మాత్రమే కాదు.. దక్షిణాదిలో ఇస్లామిక్ విస్తరణను ప్రతిఘటించిన చివరి ప్రధాన హిందూ రాజ్యం విజయనగర సామ్రాజ్యమే. అయితే దాని విధ్వంసం భారతీయ చరిత్రలో ఒక మలుపుగా నిలిచింది. నేడు హంపి శిథిలాలు కర్ణాటకలోని రాతి భూభాగాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. హింపి కోల్పోయిన వైభవం హింసాత్మక ముగింపుకు ఒక నిదర్శనం.
హంపి విశిష్టత..
ముస్లిం చేతుల్లో చిద్రమైనప్పటికీ హంపిలో విరుపాక్ష ఆలయం మాత్రం చెక్కుచెదరకుండా నిలిచింది. విరూపాక్ష ఆలయం రాజగోపురం పదకొండు అంతస్తులుగా నిర్మితమైంది. ఈ దేవాలయానికి మూడు గోపురాలు ఉన్నాయి. తూర్పు గోపురం 160 అడుగుల ఎత్తులో తొమ్మిది అంతస్తులుగా నిర్మితమైంది. 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయలు పునర్నిర్మించాడు. విరూపాక్ష ఆలయం లోపల గోడ మీద 6 అంగుళాల సన్నటి చీలిక ఉంటుంది.
గర్భగుడి నీడ ఆలయం వెనుక వైపు తలకిందులుగా పడుతుంది. సూర్యోదయం నుంచి ఉదయం 9 గంటల వరకు ఈ నీడ కనిపిస్తుంది. గోపురం నీడ ఎత్తు 15 అడుగులు.. గోపురం ఎత్తు కూడా 15 అడుగులే ఉండడం గమనార్హం. ఇదే హంపిలో విఠలాలయం శిల్పకళా రిత్యా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలయంలో సంగీత స్తంభాల మండపంలో 56 స్తంభాలున్నాయి.
వీటిలోని 7 స్తంభాలను మీటితే సప్త స్వరాలు, సరిగమలు వినిపించడం ఒక అద్భుతం. అంతేకాదు ప్రపంచంలోని ఏ శివాలయలోని లేని విధంగా ఇక్కడ మూడు తలలు కలిగిన నంది విగ్రహం దర్శనమిస్తుంది. ఇక హంపిలోని స్మారక చిహ్నాల సముదాయాన్ని యునెస్కో 1985లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ ప్రాంతం సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత గొప్పగా ఉంటుందని యునెస్కో పేర్కొంది.