calender_icon.png 13 August, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ప్రమాణం చేస్తావా?

10-08-2025 12:00:00 AM

- కేటీఆర్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్

- ఎమ్మెల్సీ కవితను కూడా విచారించాలని డిమాండ్

- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం, రోషం ఉంటే ఆ పార్టీని వదిలి బయటకు రావాలంటూ ఫైర్

కరీంనగర్, ఆగస్టు 9 (విజయక్రాంతి): “ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మావద్ద సమాచారముంది. ఆధారాలున్నాయి. ఇదే విష యంపై ఏ గుడికైనా కుటుంబ సభ్యులతో కలిసి వస్తా. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని దేవు డి సాక్షిగా ప్రమాణం చేస్తా. నువ్వు కూడా నీ భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో కలిసి గుడికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని వాళ్లందరితో కలిసి ప్రమాణం చేస్తావా?” అని మాజీ మంత్రి కేటీఆర్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో కల్వకుంట్ల కవితకు కూడా నోటీసులిచ్చి విచారణ జరపా లని కోరారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. శనివారం కరీంనగర్‌లోని తన నివాసంలో బండి సంజయ్ కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, జర్నలిస్టులతో కలిసి రాఖీ సంబురాలు జరుపుకు న్నారు. ఈ సందర్భంగా మీడియాతో మా ట్లాడుతూ.. రాజకీయ నాయకుడివై ఉండి నేరుగా ఎదుర్కొనే దమ్ములేక చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీసుల తో బెదిరించాలనుకోవడం అంతకంటే మూ ర్ఖత్వం లేదన్నారు.

ఆ నోటీసులకు భయపడే వ్యక్తిత్వం తనది కాదన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం, రోషం ఉంటే ఆ పార్టీని వదిలి బయటకు రావాలని ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలనే విషయంలో తమకు స్పష్టత ఉన్నదని చెప్పారు. మావోయిస్టుల పేరు చెప్పి రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, వ్యాపారు లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను ట్యా ప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి? అనే విషయాలను తేల్చడం సి ట్ అధికారుల స్థాయికి మించిన పని అని, వీటిని దృష్టిలో ఉంచుకుని సీబీఐ, ఈడీ విచారణ జరపాలని కోరుతున్నామన్నారు. ప్రభా కర్‌రావు రిటైరైనా కూడా ఐజీగా కొనసాగుతున్నారని కేంద్ర హోంశాఖకు కేసీఆర్ తప్పుడు సమాచారమిచ్చి ఎస్‌ఐబీ చీఫ్‌గా ని యమించారని ఆరోపించారు. జడ్జీల ఫోన్ల ను కూడా ట్యాప్ చేశారని, జడ్జీలకు నోటీసులిచ్చి పిలిచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసే అధికారం సిట్‌కు ఉందా అన్నారు.

ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు మం త్రుల ఫోన్లను కూడా గత ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆ ఆధారాలు సిట్ వద్ద ఉన్నాయ ని, సీఎంకు నోటీసులిచ్చి విచారణకు రమ్మ ని ఆదేశించే సాహసం సిట్ చేయగలుగుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ చెపితేనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రధాన నిందితులు రాధాకిషన్‌రావు పోలీసుల విచార ణలో వెల్లడించారని, నాటి డీజీపీ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్‌రావు చెప్పారని అయినా ఇంతవరకు వాళ్లకు నోటీసులిచ్చి పిలిచే సాహసం కూడా సిట్ చేయలేకపోతోందని మండిపడ్డారు.

వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసి తమ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకున్నారని ఆరోపించారు. బెంగాల్, కర్నాటక రాష్ట్రా లకు డబ్బులు పంచారని, బెంగాల్‌లో మమ తా బెనర్జీ వద్దకు పోయి కేసీఆర్ డబ్బులు ఇచ్చాడని ఆరోపించారు. మమతా బెనర్జీ కేసీఆర్‌ను గుర్తు పట్టకపోతే ఇబ్బంది పడ్డది నిజం కాదా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. వ్యక్తిగత విషయాలకు పోవద్దని ఆలోచిస్తున్నానని, లేకుంటే కేటీఆర్ బండారమంతా బయటపెడతానని చెప్పారు. 

సిట్ అధికారులపై మాకు నమ్మకం ఉందిబికానీ రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా ఈ రేసుసహా అనేక కేసుల్లో విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. రాజకీయంగా నేరుగా ఎదుర్కొ నే దమ్ములేకు చేసిన తప్పులు, పాపాల నుం డి తప్పించుకునేందుకు లీగల్ నోటీసుల పే రుతో భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు.