28-03-2025 12:00:00 AM
బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
కాగజ్‌నగర్, మార్చి 27 (విజయక్రాంతి): అసమర్థుల పాలనలో రాష్ట్రం ఆగమవుతుందని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురువారం కాగజ్ నగర్ మండ లం కోసిని గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్న విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గు చేటని విమర్శించారు. రాష్ట్రంలో పరీక్ష కేం ద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్ర ఇంటలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. నకిరేకల్ లో పదవ తరగతి తెలుగు ప్రశ్న పత్రం లీకేజీ కావడం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పరిపా లనను పక్కనపెట్టి ప్రతిపక్షాలపై ప్రతీకార చర్యలు తీసుకోవడానికి పనిచేస్తున్నారని విమర్శించారు.
ప్రజా సంక్షేమం పూర్తిగా గాడి తప్పిందని, గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలలో చదువుతున్న 68 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న పాపం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడం రాకుంటే తప్పుకోవాలి కానీ ప్రశ్నించే ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం సరికాదని పీతవు పలికారు. ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకుడు శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు.