calender_icon.png 17 August, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ వేదికపై తెలంగాణ అగ్రగామిగా ఉంటుంది

16-08-2025 12:45:50 AM

- స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 

- కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసిన స్పీకర్ 

వికారాబాద్, ఆగస్టు- 15( విజయ క్రాంతి ) ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో జరిగిన ఉత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ఎగురవేశారు. మొదటగా జిల్లా సాయుధ బలగాల గౌరవ వందనం స్పీకర్ ప్రసాద్ కుమార్ స్వీకరించారు.

ఈ  సందర్బంగా ప్రజలనుద్దేశించి సభాపతి మాట్లాడుతూ.. చరిత్రలో ఆగస్టు 15వ తేదీకి విశిష్టమైన స్థానం ఉందని, రెండు శతాబ్దాలపాటు విదేశీయుల నిరంకుశ పాలనలో నలిగిన మన జాతి, స్వేచ్ఛా వాయువులు పీల్చిన మహత్తరమైన రోజు ఇదన్నారు.మహానుభావుల నాయకత్వంలో, ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం లభించిందన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మన రాజ్యాంగం, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా భారతదేశాన్ని నిలబెట్టిందని, మన ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రజాస్వామ్య భారతదేశాన్ని మనము నిర్మించుకున్నామన్నారు.