calender_icon.png 25 July, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యాటక శాఖ స్వయం సంవృద్ధి సాధించాలి

23-07-2025 12:02:37 AM

- తెలంగాణలో అంతర్జాతీయ కార్నివాల్

- పర్యాటక ప్రగతిపై సమీక్షలో అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశాలు 

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా  తెలంగాణను  తీర్చిదిద్దాలన్న లక్ష్యాని కి అనుగుణంగా అధికారులు పని చేయాల ని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచి న రియో కార్నివాల్ తరహాలో తెలంగాణలో అంతర్జాతీయ కార్నివాల్ నిర్వహణకు ప్రతిపాదనలు, ప్రణాళికలు రూపొందించాలన్నా రు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో పర్యాటక ప్రగతిపై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు.

మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, టూరిజం డెస్టినేషన్ సెంటర్‌ల ను తీర్చిదిద్దాలన్నారు. పర్యాటక రంగం ద్వా రా ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, సాం స్కృతిక మార్పిడిని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  పీపీపీ విధానంలో 27 ప్రత్యేక పర్యాటక  ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలని, నిర్వీర్యమై న ఆస్తుల నుంచి ఆదాయం సృష్టించాలని పేర్కొన్నారు.

ప్రైవేట్  హోటల్స్, ట్రావెల్స్‌కు  ధీటుగా ఆదాయం పెంచుకోవాలని, పర్యాటక శాఖ స్వయం సంవృద్ధి సాధించాలని అధికారులకు మంత్రి దిశానిర్ధేశం చేశారు. బోనాలు, బతుకమ్మ, సమ్మక్క -సారలమ్మ జాతర, నాగోబా జాతరలను ఘనంగా నిర్వహించి, దేశీయ అంతర్జాతీయ పర్యాటకుల ను ఇక్కడికే రప్పించేలా కృషి చేయాలని తెలిపారు. వాటర్ స్పోర్ట్స్‌లో సాహస క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని, అవసరమైతే ఇతర రా ష్ట్రాలకు వెళ్లి దీనిపై అధ్యయనం చేయాలన్నారు.

రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై ప్రచారం కల్పించాలని, బ్రాండింగ్, ప్రమోషన్‌పై ఫోకస్ చేయాలని, సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని అధికారులకు సూ చించారు. తెలంగాణ సంస్కృతిని చాటి చె ప్పేలా పర్యాటక ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, కళాకారులకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్‌రంజన్, టీజీటీడీసీ మేనెజింగ్ డెరెక్టర్ వల్ల్లూరు క్రాంతి, ఇతర అధికారులు పాల్గ్గొన్నారు.