calender_icon.png 4 August, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనంలేని యాత్రకు జనహిత పేరు పెట్టారు

04-08-2025 12:49:25 AM

 ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 

 ఆర్మూర్ నిజామాబాద్, ఆగస్ట్ 3 ( విజయ క్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన యాత్ర ‘జనహిత పాదయాత్ర’ కాదని.. ‘జనరహిత పాదయాత్ర’ అని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జనం లేక మీనాక్షి పర్యటన వెలవెలబోతోందన్నారు. మీనాక్షి పాదయాత్రకు ప్రజాస్పందన లేకపోవడంతో పీసీసీ చీఫ్ సైతం అసహనం వ్యక్తం చేశారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. తాను పంపిన డబ్బులు అందరికీ పంచలేదా.. అని పార్టీ వర్గాలపై పీసీసీ చీఫ్ రుసరుసలాడాడని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో సిద్దులగుట్ట శివయ్య సాక్షిగా నిజాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

నారా లోకేష్ వ్యాఖ్యలపై స్పందించకపోవడం సరికాదు : వేముల ప్రశాంత్ రెడ్డి

రేవంత్‌ను డమ్మీ సీఎంను చేసి ఢిల్లీ చుట్టూ తిప్పుకుంటున్నారని, మీనాక్షి నటరాజన్‌ను షాడో సీఎంను చేసి తెలంగాణలో తిప్పుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికే 50 సార్లు ఢిల్లీ వెళ్లి గాంధీ ఫ్యామిలీకి రేవంత్‌రెడ్డి భజన చేస్తున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఇక మీనాక్షి పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతో ఆర్మూర్ రైతులపై పోలీసుల దాష్టీకాలు కొనసాగాయని ఆయన ఆరోపించారు.

 అన్నదాతలను అరెస్ట్ చేసి పాదయాత్రలా..?

జిల్లా వ్యాప్తంగా అన్నదాతలను.. బీఆర్‌ఎస్  కార్యకర్తలను అరెస్ట్‌లు చేసి పాదయాత్ర నిర్వహించి ఏం సాధించాలని అనుకుంటున్నారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను  కోమాలోకి పంపించారని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్క నిజామాబాద్  జిల్లాలోనే 2 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్న విషయం పాదయాత్ర సందర్భంగా మీ దృష్టికి రాలేదా అని ఆయన ప్రశ్నించారు. రూ. 4వేల చొప్పన ఆసరా పెన్షన్లు ఇస్తామన్న హామీ ఏమైందని.. కళ్యాణ లక్ష్మి ద్వారా ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా ఆయన ప్రశ్నించారు.

 బనకచర్లను అడ్డుకొని తీరుతాం.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అసభ్యకరమైన మాటలు మానుకోవాలని జీవన్ రెడ్డి హితవు పలికారు. బీఆర్‌ఎస్ పదేళ్లపాలనపై పచ్చిఅబద్దాలు చెబుతూ..కేసీఆర్, కేటీఆర్‌పై విషం కక్కుతున్నాడని పీసీసీ చీఫ్‌ను విమర్శించారు. బీఆర్‌ఎస్‌పై అబద్ధపు ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు.