calender_icon.png 2 August, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

02-08-2025 01:36:33 AM

  1. మీనాక్షి నటరాజన్ 

కార్యకర్తల కష్టార్జితమే నేటి అధికారం 

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి 

ముఖ్య కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన ఇంచార్జ్

వికారాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి )ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్ర జా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకా న్ని కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నట రా జన్ అన్నారు. శుక్రవారం పరిగి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ కష్టా ల్లో ఉన్నప్పుడు నిస్వార్థంగా, ఆత్మీయం గా,అంకితభావంతో పని చేసిన కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి అసలైన శక్తి అన్నారు. అ లాంటి త్యాగస్వరూపులైన కార్యకర్తలను పా ర్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంద అ న్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే, అది కార్యకర్తల కష్టానికే ఫలితమేన ని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు అ ర్హులైన పేద కుటుంబాలకు ఇళ్లను కేటాయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన త రువాత అణగారిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారి టీ వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తున్నామని, రాజ్యాంగబద్ధమైన పదవులను వారికి చ్చేలా కృషి చేస్తున్నామన్నారు .బీసీలకు స్థానికసంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని,ఇచ్చిన హామీకి తాము కట్టుబడి ఉ న్నామని చెప్పారు.

బీసీలకు 42% రిజర్వేష న్లు కల్పించాలని ఉద్దేశంతోనే బిజెపి ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా ఆగస్టు 5, 6, 7 తేదీలలో తెలంగాణ సీఎం సహా మం త్రు లు, ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. రా బోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి సామాజిక న్యాయాన్ని స్థాపించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

రాబోయే స్థానిక సం స్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త అభ్యర్థి అన్నట్టు గా భావించి,అందరూ కలిసికట్టుగా శ్రమించాలి. సర్పంచ్,ఎంపీటీసీ,జెడ్పిటిసి స్థానాల లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే మన ల క్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్టీ తరపున మీకు అవసరమైన అన్ని విధాల స హాయ సహకారాలు అందిస్తాం అని ప్రతి ఒక్క కార్యకర్త గెలవాలి, గెలిపించాలిఅనిఅన్నారు.