calender_icon.png 30 January, 2026 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనదుర్గామాత ఆలయాన్ని చుట్టేసిన నీరు

24-10-2024 01:46:54 AM

పాపన్నపేట అక్టోబర్ 23: ఏడుపాయల వనదుర్గాభవానీ మాత ఆలయాన్ని వరద నీరు చుట్టేసింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో రెండు రోజుల క్రితం సిం గూరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ఘనపురం ప్రాజెక్ట్ నిండి పొంగిపొర్లుతోంది. దీంతో ఆలయం ముందు నుంచి నది పాయలలో నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఆలయాన్ని చుట్టేసింది. అధికారులు తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేసి మంగళవారం నుంచి రాజగోపురంలోనే ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు.