calender_icon.png 22 January, 2026 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం

22-01-2026 01:24:44 AM

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల, జనవరి 21 : రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం గద్వాల నియోజకవర్గం ధరూ ర్ మండల కేంద్ర ము రైతు వేదిక లో జోగులాంబ గద్వా ల జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆధ్వర్యం లో వ్యవసా య యాంత్రీకరణ పథకం రాయితీ పై యం త్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.

ముందుగా ధరూర్ మండలంలోని అర్హులైన16 మందికి లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పత్రము ను వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా వ్యవసాయం యంత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు దేశానికి అన్నం పెట్టేవాడు రైతు అని వ్యవసాయ రంగంలో ప్రస్తుతం టెక్నాలజీకి సంబంధించిన యంత్రాలను ఉపయోగించి రైతులు వ్యవసాయం చేయడం జరుగుతుందని వారికి ప్రభుత్వం తరఫున సబ్సిడీలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా అర్హులైన రైతులకు సబ్సిడీ ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతుల అభ్యున్నత కు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో కూడా రైతులకు వ్యవసాయ పనిముట్లను అందించడం జరిగింది. అదేవిధంగా రైతులకు వ్యవసాయ ఉచితంగా విద్యుత్ అందజేస్తూ రైతులకు సబ్సిడీ ద్వారా వ్యవసాయ పనిముట్లను అందజేయడంతో రైతులు మంచి పంటలను పండించి రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, మాజీ ఎంపీపీ విజయ్ మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మాజీ ఆలయం కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి , ఉప సర్పంచ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీరాములు, రంగస్వామి, యుగంధర్ గౌడ్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు మండలం అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.