calender_icon.png 5 May, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం

19-04-2025 12:53:59 AM

మండల కో ఆర్డినేటర్ జుకంటి రాజగౌడ్

నార్సింగి(చేగుంట), ఏప్రిల్ 18 :పేదల సంక్షేమం, రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని నార్సంగి మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జూకంటి రాజాగౌడ్ పేర్కొన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా నార్సింగి మండల భీంరావుపల్లిలో నార్సంగి మండల ఇంచార్జ్ జూకంటి రాజాగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు.

గ్రామంలో వాడవాడకు, ఇంటింటికి తిరుగుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాం గం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ రాజ్యాంగ పరిరక్షణకై అందరూ పోరాడాలని పిలుపుని చ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వినోద్, గ్రామ అధ్యక్షులు కుమార్, రాములు, ఉపాధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్నం రాజేందర్ రెడ్డి, మాజీ టెలికాం బోర్డు మెంబర్ రాజేష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గోవర్ధన్, మైనారిటీ నాయకులు నదీమ్, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు కుర్మ లక్ష్మి, గ్రామ యువత, గ్రామస్తులుపాల్గొన్నారు.