17-01-2026 02:27:53 AM
రిజర్వేషన్ కలిసి వస్తుందో లేదో అన్న ఆందోళన
బెంగ పెట్టుకున్నా ఆశావాహులు
వార్డుల వారీగా రిజర్వేషన్ల కోసం ఎదురుచూపు
కలిసి వస్తుందో లేదోనన్న బెంగ
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై ఆసక్తి
కామారెడ్డి, జనవరి 16 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తులు చేస్తూ ముందుకు వస్తుండగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రిజర్వేషన్ల బెంగ పట్టుకుంది. మున్సిపల్ వారిగా రిజర్వేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించగా వార్డుల వారిగా రిజర్వేషన్లపై బెంగ పెట్టుకున్నారు.
వార్డుల వారిగా రిజర్వేషన్ల కోసం ఆసక్తి
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థులకు రిజర్వేషన్ల బెంగ పట్టుకుంది. వార్డుల వారీగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేస్తేనే ఆశ వాహూలకు పోటీ చేసేందుకు అవకాశం కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. రిజర్వేషన్ కలిసి రాకుంటే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం గల్లంతవుతుందని ఆశవాహూలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వార్డుల వారిగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేస్తే పోటీకి కలిసి వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వార్డుల వారిగా రిజర్వేషన్ లను ప్రకటిస్తే ఆశావా హూలకు టెన్షన్ నుంచి విముక్తి కలుగుతుంది.
చైర్మన్, వార్డుల రిజర్వేషన్ ఎప్పుడు..?
కామారెడ్డి జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద పట్టణాలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రిజర్వేషన్ల వివరాలను ప్రకటించింది. చైర్మన్ స్థానాలు రిజర్వేషన్ కావాల్సి ఉంది. వార్డుల వారిగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ఆశవా హూలకు రిజర్వేషన్లు ప్రకటిస్తేనే పోటీ చేసేందుకు అవకాశం వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్లు కలిసి రాకుంటే పోటీ నుంచి విరమించుకోవాల్సి వస్తుందని ఆశవాహూలైన అభ్యర్థులు పేర్కొంటున్నారు.
కామారెడ్డిలో 49 వార్డులు
జిల్లాలోని అతిపెద్ద మున్సిపాలిటీ కామారెడ్డి లో 49 వార్డులు ఉన్నాయి. ఎస్టీ జనరల్, 1, ఎస్సీ జనరల్ రెండు, ఎస్సీ మహిళా రెండు, బిసి మహిళలు 9, బీసీ జనరల్ 10, జనరల్ మహిళ 14, జనరల్ 12, స్థానాలకు రిజర్వేషన్లు ప్రభుత్వం ప్రకటించింది. కామారెడ్డి పట్టణంలో 49 వార్డులలో 93, 318 ఓటర్లు ఉన్నారు.
బాన్సువాడలో 19 వార్డులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ లో 19 వార్డులు ఉన్నాయి. ఎస్టి జనరల్ ఒకటి, ఎస్సీ జనరల్ 1, ఎస్సీ మహిళ 1, బీసీ జనరల్ 3, బిసి మహిళ 3, జనరల్ మహిళ 5, జనరల్ 5, వార్డులు ఉన్నాయి. వార్డుల వారిగా రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంది.
ఎల్లారెడ్డి పట్టణంలో 12 వార్డులు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో 12 వార్డులు ఉన్నాయి. ఎస్టి జనరల్1, ఎస్సీ జనరల్ 1, ఎస్సీ మహిళ 1, బీసీ మహిళ ఒకటి, బీసీ జనరల్ 2, జనరల్ మహిళ 4, జనరల్ రెండు వార్డులు రిజర్వేషన్ అయ్యాయి.
బిచ్కుందలో 12 వార్డులు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో 12 వార్డులు ఉన్నాయి. ఎస్టి జనరల్1, ఎస్సీజనరల్ 1, ఎస్సీ మహిళ 1, బీసీ మహిళ 1, బీసీ జనరల్ 2, జనరల్ మహిళ 4, జనరల్ 2, వార్డులు రిజర్వేషన్ ఖరార్ చేశారు.
వార్డుల వారి రిజర్వేషన్లపై బెంగ
కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు రిజర్వేషన్ తమ వార్డు తమకు కలిసి వస్తుందా లేదా అని బెంగ పడుతున్నారు. వార్డుల వారి రిజర్వేషన్లు ఖరారు పోటీ చేసేందుకు అవకాశం కలిసి వస్తుందని రిజర్వేషన్ కలిసి రాకుంటే పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజుల్లో వార్డుల వారీగా ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. పోటీ చేసేందుకు తహతహలాడుతున్న ఆశవాహూలకు వార్డుల రిజర్వేషన్ అనుకూలంగా వస్తుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వార్డుల వారి రిజర్వేషన్లను ప్రకటించాలని కోరుతున్నారు.