calender_icon.png 9 January, 2026 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కదంతొక్కిన కరీంనగర్ కుర్రాడు

07-01-2026 12:00:00 AM

  1. అమన్‌రావు డబుల్ సెంచరీ
  2. షమీ, ముకేశ్, ఆకాశ్ దీప్‌లకు చుక్కలు
  3. హైదరాబాద్‌కు భారీ విజయం

రాజ్‌కోట్, జనవరి 6: దేశవాళీ క్రికెట్‌లో ఎంత టాలెంట్ ఉందో ఎప్పటికప్పుడు రుజువ వుతూనే ఉంది. తమ ప్రతిభకు సరైన వేదికగా భావించే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ ల్లో సత్తా చాటుతుంటారు. ఈ మధ్య కాలంగా తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లు కూడా అదరగొడు తున్నారు. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన యువ క్రికెటర్ అమన్ రావు విజ య్ హజారే ట్రోఫీలో దుమ్మురేపేశాడు. ఏకం గా డబుల్ సెంచరీ బాదాడు. అది కూడా  భారత బౌలర్లు మహ్మద్ షమీ, ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్ వంటి సీనియర్లకు చుక్కలు చూపిస్తూ ద్విశతకం సాధించాడు.

బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తరపున అది రిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.  154 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 200 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో అత నికి ఇదే తొలి సెంచరీ. ఈ అవకాశాన్ని అద్భు తంగా వినియోగించుకుని డబుల్ సెంచరీగా మలిచాడు. మరో విశేషం ఏమిటంటే అమన్ రావు కెరీర్‌లో ఇది మూడో లిస్ట్ ఏ మ్యాచ్ మాత్రమే. అమన్ రావు దెబ్బకు బెంగాల్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. షమీ 3 వికె ట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించు కున్నాడు.

అలాగే మిగిలిన బౌలర్లు ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్, షాబాదజ్ అహ్మద్ లను ఉతికారేశాడు. షమీ, ముకేశ్, ఆకాశ్ ముగ్గురి బౌలింగ్‌లో అమన్ రావు ఏకంగా 8 సిక్సర్లు బాదాడు. ఆకాశ్ దీప్ వేసిన ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్సర్‌గా కొచ్చి డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 65 బంతుల్లో హాఫ్ సెంచరీ, 108 బంతుల్లో సెంచరీ సాధించిన అమన్ రావు తర్వాత 46 బంతుల్లోనే మరో వంద పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అమన్ రావు పలు రికార్డులు నెలకొల్పాడు.

లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో ద్విశతకం చేసిన 15వ భారత ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే హైదరాబాద్ తర పున లిస్ట్ ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గానూ నిలిచాడు. అమర్ రావు విధ్వంసంతో హైదరాబాద్ 352 పరుగుల భారీస్కోర్ చేసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన అమన్‌రావు గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. హైదరాబాద్ తరపు న 11 టీ20ల్లో 301 పరుగులు చేశాడు. దీని లో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శల తోనే ఇటీవల మినీ వేలంలో రాజస్థాన్ రాయ ల్స్ అమన్ రావును రూ.30 లక్షలకు కొనుగో లు చేసింది.

ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 353 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బెంగా ల్‌ను హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ బెంబేలెత్తించాడు. దీంతో బెంగాల్ 245 పరు గులకే ఆలౌటైంది. షమీ 4 వికెట్లతో అదరగొ ట్టాడు. కివీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు సిరాజ్ సత్తా చాటాడంతో టీమిండి యా మేనేజ్‌మెం ట్ హ్యాపీగా ఉంది. విజయ్‌హజారే ట్రోఫీలో హైదరాబాద్‌కు ఇది రెండో విజయం.