calender_icon.png 19 October, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకతీయ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలి

18-10-2025 12:09:06 AM

-ముగిసిన వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ క్యాంపెయిన్

-రామప్పలో టూరిస్ట్ పోలీసుల సేవలు ప్రారంభం

వెంకటాపూర్ (రామప్ప), అక్టోబరు17 (విజయక్రాంతి) : ములుగు జిల్లా వెంకట పూర్ మండలంలోని రామప్పలో వరల్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంపెయిన్ ముగింపు కార్యక్రమం శుక్రవారం ఆలయ ప్రాంగణం లో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిజిపి రతన్, డైరెక్టర్ అర్జున్ రావు హాజరయ్యారు. ఈ సంద ర్భంగా డైరెక్టర్ అర్జున్ రావు మాట్లాడుతూ.. దేశం లోని నలుమూలల నుండి వచ్చి శిక్షణ తీసు కున్న వాలంటీర్స్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ డిజిటల్ యుగంలో చరిత్ర ఆర్కియాలజీ కన్జర్వేషన్ మరియు రిజర్వేషన్ వీటి మీద ఆసక్తి చూపి ఈ శిక్షణకు వచ్చినందుకు వారిని అభినందించారు. రాష్ట్రంలోని వివిధ చారిత్రక ప్రదేశాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఒక మాస్టర్ ప్లాన్ ని తయారు చేస్తున్నామని, ప్రతి ఒక్క చారిత్రక ప్రదేశా లన్నింటిని అభివృద్ధి చెందడానికి ప్రభు త్వం కృషి చేస్తోందని అన్నారు.

అనంతరం మాజీ డిజిపి రతన్ మాట్లాడుతూ.. కాకతీ యులు నిర్మించిన దేవాలయాలు, సరస్సు లు ఎంతో ప్రాముఖ్యతను సంతరించు కున్నాయని, వాటి ప్రఖ్యాతను తెలుసుకొని ఈ కాకతీయుల కీర్తి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రొఫెసర్ పాండురంగారావు కృషి చేశారని, ఇలాంటి శిక్షణ యువతకి ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమం లో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రొఫెసర్ పాం డురంగారావు, శ్రీధర్ రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా అసిస్టెంట్ టూరిజం ప్రమో షన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్య కిరణ్, ఇరాన్ దేశ వాలంటీర్స్, 13 రాష్ట్రాల వాలం టీర్స్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, పర్యాటక శాఖ, కేంద్ర ప్రభుత్వ శాఖ, దేవాదాయ శాఖ సిబ్బందీలు తదితరులు పాల్గొన్నారు.

రామప్పలో టూరిస్ట్ పోలీసుల సేవలు ప్రారంభం..

తెలంగాణ పర్యటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక క్షేత్రాలలో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకుల రక్షణ సహాయ కోసం 80 మంది టూరిస్ట్ పోలీసులను నియమించింది. అందులో భాగంగా మలుగు జిల్లాలోని ప్రపంచ పర్యాటక క్షేత్రమైన రామప్ప దేవాలయానికి నలుగురు టూరిస్ట్ పోలీసులు, మేడారం సమ్మక్క జాతర జాతరకు ఆరుగురు పోలీసులను మొత్తం జిల్లాకు పదిమంది పోలీసులను నియమించింది. శుక్రవారం రామప్ప దేవాలయానికి నియమించిన నలుగురు టూరిస్ట్ పోలీసులలో ముగ్గురు విధులకు హాజరయ్యారు.