24-07-2025 01:15:41 AM
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వేడి ఢిల్లీని తా కింది. గడిచిన రెండు రోజుల్లో కాంగ్రెస్ ప్రముఖులందరూ ఢిల్లీకి వెళ్లడం.. గురువారం పార్ల మెంట్ ఆవరణలో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భ ట్టి, ఇతర మంత్రులు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు చేసిన సర్వే, నివేదికలు, క్యాబినెట్ తీర్మానం తదితర అంశా లన్నింటినీ కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయిం ట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. దీనితో బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఇవాళ అగ్రనేతలతో సీఎం భేటీ
ఇప్పటికే రెండు రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసిన సీఎం గురువారం ఏఐసీసీ అ ధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీలతో సమావేశం కానున్నా రు. ఈ సందర్భం గా రాష్ట్రంలో చేసిన కులగణన సర్వే సమాచారం, 42 శాతం బీసీ రిజర్వే షన్లు తదితర అంశాలను వారికి వివరించనున్నారు.
సాయంత్రం 5 గంటలకు ఇందిరాభవ న్‌లో కాంగ్రెస్ ఎంపీలకు తెలంగాణలో చేసిన సర్వే, బీసీ రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రె జెంటేషన్ ఇవ్వనున్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలులోకి తీసుకురావాలంటే.. కేం ద్రం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండటం తో... ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ స మావేశాల సందర్భంగా ఉభయసభల్లో ఈ అంశాన్ని లేవనెత్తి కాంగ్రెస్ ఎంపీలతో కేంద్రం పై ఒత్తిడి పెంచేలా ముందుకు సాగుతున్నారు.
ఢిల్లీ బాటన మంత్రులు
గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీలతో సమావేశం, సా యంత్రం కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయిం ట్ ప్రెజెంటేషన్‌లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, బీసీ మంత్రులు పొన్నం, సురేఖ, శ్రీహరి కూ డా హుటాహుటిన రాత్రికల్లా ఢిల్లీకి చేరుకున్నారు. నేతలందరూ ఢిల్లీకి రావడం ద్వారా బీ సీ రిజర్వేషన్ల విషయంలో తామంతా కట్టుబడి ఉన్నామనే సంకేతాలను పంపడంతోపాటు కేంద్రంపై పార్టీ పరంగా ఎంపీలతో ఒత్తిడి పెం చేందుకు మరింత ఆస్కారం ఏర్పడుతుందనే భావనలో ఉన్నారు.
పైగా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీ వీహెచ్, ఇతర ప్రముఖులు కూడా ఒక బృందంగా కాం గ్రెస్ పెద్దల ను కలుసుకోవడం ప్రభావవంతంగా ఉంటుందని కాంగ్రెస్ నేతల ఆలోచన. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ఎంపీలకు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వివరిస్తూ బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో.. ఇక బంతి తమ వద్ద లేదని, బీజేపీ వద్దే ఉందనే విధంగా ప్రజలకు తెలియజెప్పేందుకు కాంగ్రెస్ పెద్దలు అడుగులు బలంగా వేస్తున్నారు.
25న భాగీధారి న్యాయ్ సమ్మేళన్
ఈనెల 25న ఢిల్లీలో భాగీధారి న్యాయ్ సమ్మేళన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తల్కతోరా ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న భాగీధారి న్యాయ్ సమ్మేళన్ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్‌ను ఆహ్వానించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓబీసీ సెల్ చైర్మన్ డాక్టర్ అనిల్ జైహింద్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నేత, ఓబీసీ ఎంపీల ఫోరం మాజీ కన్వీనర్ వి.హనుమంతరావులు కలుసుకుని సచిన్‌పైలట్‌ను ఆహ్వానించారు.