calender_icon.png 14 January, 2026 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌లో మ్యాచ్‌లు ఆడే ప్రసక్తే లేదు: బీసీబీ

14-01-2026 01:13:23 AM

ముంబై: టీ20 ప్రపంచకప్- భారత్‌లో మ్యాచ్‌లు ఆడే విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన పట్టు వీడటం లేదు. మంగళవారం ఐసీసీతో జరిగిన సమావేశంలోనూ టోర్నమెంట్ కోసం భారత్‌కు వెళ్లకూడదని తమ నిర్ణయాన్ని బీసీబీ స్పష్టం చేసింది. భద్రతా కారణాలను వల్ల తమ జట్టును భారత్‌కు పంపబోమని, తమ మ్యాచ్లను శ్రీలంక లేదా మరేదైనా ఇతర వేదికకు మార్చాలని మరోసారి బీసీబీ డిమాండ్ చేసింది. షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కావగడంతో వేదికలను మార్చడం అసాధ్యమని, బీసీబీ తన వైఖరి పునఃపరిశీలించుకోవాలని ఐసీసీ సూచించింది. కానీ బంగ్లా క్రికెట్ బోర్డు మాత్రం ఆటగాళ్లు భద్రత తమకు ముఖ్యమని బీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది.