16-09-2025 01:10:52 AM
-ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి
-విద్యాకమిషన్ చైర్మన్‌కు వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగ తికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని ఎమ్మె ల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని పీఆర్టీయూటీఎస్ సంఘ కార్యా లయాన్ని విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యావ్యవస్థ బలోపేతానికి అనేక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పోషక విలువలు పెంచేలా భోజన తయారీ ఏజెన్సీలకు చెల్లించే మొత్తాన్ని పెంచుతూ రేషన్ సరుకులను ప్రభుత్వమే అందించాలని కోరారు. ఉన్నత పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు, లైబ్రరీ రూమ్‌లను ఏర్పాటు చేయాలని, క్రీడా పరికరాలను ఇస్తూ పీఈటీ ఉపాధ్యాయులను నియమించాలని విజ్ఞప్తి చేశారు.