calender_icon.png 20 November, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12ఏ రైల్వే కాలనీలో నేను చేసే మాస్ సౌండింగ్ ఉండదు

20-11-2025 12:00:00 AM

అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘పొలిమేర’ ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా వ్యవహరిస్తూ, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సినిమా విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. “-మ్యూజిక్ చేసిన నాకే ‘12ఏ రైల్వే కాలనీ’ కొత్తగా ఉంది.

నేనే మ్యూజిక్ చేశానా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది డిఫరెంట్ జోనర్ సినిమా. నేను చేసిన బలగం, మాస్ జాతర, ధమాకా, మ్యాడ్, టిల్లు స్క్వేర్, సంక్రాంతికి వస్తున్నాం.. ఇవన్నీ గ్రామీణ నేపథ్యం, మాస్, యూత్‌ఫుల్, ఫ్యామిలీ వంటి డిఫరెంట్ జోనర్ సినిమాలు. ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాలు ఒకేసారి రావడం నా అదృష్టం.

నన్ను ఈ జోనర్‌లో ఉండే మూవీస్‌కి ఈ ‘12ఏ రైల్వే కాలనీ’ తీసుకెళ్తుందని గట్టిగా నమ్ముతున్నా. నేను చేసే మాస్ ఓరియెంటెడ్ సౌండింగ్ ఇందులో ఉండదు. కంప్లీట్‌గా వేరే సౌండ్ ఉంటుంది. కథకు అవసరమయ్యే వాయిద్యాలే వాడాం. ఇక ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలంటే.. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘మన శంకర వర ప్రసాద్ గారు’, ‘డెకాయిట్’, ‘టైసన్ నాయుడు’, సంపత్ నంది ‘భోగి’, విశ్వక్‌సేన్ ‘ఫంకీ’ చిత్రాలు చేస్తున్నాను” అన్నారు.