calender_icon.png 1 November, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానికంగా ఉండరు.. సమస్యలు పట్టించుకోరు

01-11-2025 12:00:00 AM

  1. జిల్లాలో సంక్షేమ హాస్టల్ నిర్వహణ అస్తవ్యస్తం

చదువుకునే పిల్లలు..కోతి చేష్టలు

నాణ్యమైన భోజనం మెనూ అమలు ప్రశ్నార్థకం

చిద్రమవుతున్న బాల్యం 

ఖానాపూర్ (విజయక్రాంతి) పేద పిల్లల ఆరోగ్య సంక్షేమం చదువుల కోసం నిర్మల్ జిల్లాలో ఏర్పాటుచేసిన వివిధ సంక్షేమ హాస్టల్‌లో నిర్వహణ హస్తవ్యస్తంగా మారిం ది. స్థానికంగా ఉండి హాస్టల్ సమస్యలను పరిష్కరిస్తూ మౌలిక సదుపాయాలు హాస్ట ల్ వార్డులు స్థానికంగా ఉండకుండా ఇతర ప్రాంతాల నుంచి చుట్ట చూపుగా వచ్చి పోతున్నారు. దీంతో హాస్టల్‌లో ఉండే పిల్ల లు ఇబ్బందులకు గురికావడం కాకుండా పర్యవేక్షణ లోపం కారణంగా చెడు అలవాట్లకు లోనవుతున్నట్టు విమర్శలు వస్తున్నా యి. జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనలే ఇం దుకు ఉదాహరణంగా చెప్పుకోవచ్చు.

నిర్మ ల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ బీసీ హాస్టల్లో 9వ తరగతి విద్యార్థులు ఆరో తరగతి విద్యార్థి పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంక్షేమ హాస్టల నిర్వహణలో లోపానికి ఉదాహరణగా చెప్పుకో వచ్చు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్ ఉండగా ఇందులో పోస్ట్ మెట్రిక్ ఫ్రీ మెట్రిక్ హాస్టల్ లో ఉన్నాయి. ఫ్రీ మెట్రిక్ హాస్టల్ లో 5వ తరగతి నుంచి పదవ తరగతి వరకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌లో ఇంటర్ డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదువుకున్న వారికి వివిధ సంక్షేమ హాస్టల్లో వసతి కల్పిస్తున్నారు.

నిర్మల్ బైంసా ఖానాపూర్ వివరా ల్లో ఎస్సీ ఎస్టీ పోస్ట్మెట్రిక్ బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ లో ఉండగా మిగతా ప్రాంతాల్లో ప్రీ మెట్రిక్ హాస్టల్‌లో నిర్వహిస్తున్నారు. అయితే హాస్ట ల్లో హాస్టల్ వార్డెన్‌తో పాటు కుక్కు అసిస్టెంట్ కుక్కు వాచ్మెన్ స్లీపర్ ఇతర సిబ్బంది పని చేస్తున్నప్పటికీ వారు స్థానికంగా ఉండకపోవడం ఇతర ప్రాంతాల నుంచి రాకపో కలు సాగిస్తూ విద్యార్థుల భద్రతను గాలికి వదిలేస్తున్నారు

పర్యవేక్షణ లోపం పక్కదారి పిల్లలు

నిర్మల్ జిల్లాలో వివిధ సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ ప్రైవే టు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు హాస్టల్ వార్డుల పరిరక్షణ రూపం వల్ల చెడు అలవాట్లకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో విధు లు నిర్వహించే సంక్షేమ శాఖ వార్డెన్లు నిర్మల్ బైంసా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. స్థానికంగా ఉండాల ని నిబంధన ఉన్న కొందరు వార్డెన్లు దీన్ని పాటిం చడం లేదు.

హాస్టల్ నుండి విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకా రం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కావాల్సిన మౌలిక సదుపాయాలు నేటి వసతి ప్రతిరోజు స్టడీ అవర్స్ ప్రతి విద్యార్థి పై ఆరోగ్య సిద్ధ తదితర అంశాలపై దృష్టి పెట్టవలసి ఉండగా సంక్షే మ శాఖ హాస్టల్ వార్డెన్లు కొందరు రెండు మూడు రోజులకు ఒకసారి హాస్టల్ కి వెళ్లి వారికి కావాల్సిన సరుకులను అందించి హాజరు పట్టికలో హాజరు వేసుకొని తిరిగి ఇంటి ముఖం బట్టి తమ సొంత పనులను చక్కదిద్ది పెట్టుకుంటున్నారు. దీంతో హాస్టల్‌లో విధులు నిర్వహిం చే ఇతర సిబ్బంది హాస్టల్ విద్యార్థుల పై కమాండ్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు.

వంట సరుకుల ను కోత విధించి నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తున్నట్టు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పెద్ద విద్యార్థులు చిన్న విద్యార్థులపై వివక్ష చూపుతూ విమర్శలకు గురి చేస్తున్నారు. అయితే కాలేజీ పిల్లలు పెద్దవారు కావడంతో పర్యవేక్షణ లోపం కారణంగా బయ టకు వెళ్లి సిగరెట్లు ఇతర మత్తు పానీయాలు సేవిస్తున్నట్టు కూడా ప్రచారం జరు గుతుం ది. ఇటీవల హాస్టల్‌లో వారి పెట్టాల ను తనిఖీ చేయవా అందులో సీక్రెట్ డబ్బా లు బీడీలు అగ్గిపెట్టె లభించడంతో విద్యార్థులను హాస్టల్ సిబ్బంది మందలించారు.

మూడు నెల క్రితం ఓ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులు ముగ్గురు రాత్రివేళ గోడ దూకి వారి ఇంటికి చేరుకోవడంతో హాస్టల్ వార్డె న్లు ఊపిరి పీల్చుకున్నారు. హాస్టల్లో పనిచేసే క్రింది స్థాయి సిబ్బంది ఐక్యత లోపం కారణంగా పరస్పరం గొడవలకు దిగుతూ విద్యార్థుల ముందే తిట్టుకుంటూ వీరు నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. విద్యార్థులు ప్రతిరోజు స్నానాలు స్నాన బదులు ఉపయోగిం చే మరుగుదొడ్లు క్లీనింగ్ లేకపోవడంతో దుర్వాసన వచ్చి విద్యార్థులు ఇబ్బంది గురవుతున్నారు.

చాలా హాస్టల్లో వారు నిద్రించే గదుల్లో ఫ్యాన్లు కూడా లేవని దోమతెరలు ఉన్న అవి చినిగిపోవడంతో రాత్రివేళ దోమల బాధను పడలేక అభ్యర్థులు పడుతున్నారు. ఈ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేద వర్గాల పిల్లలు కావడంతో పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తమ పిల్లలను చదివించడానికి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వసతి గృహాల్లో ఉం చుతూ తల్లితండ్రులు వారిపై నమ్మకం ఉంచిన కొన్ని హాస్టల్లో విద్యార్థుల ప్రవర్తనల తీరు మిగతా విద్యార్థులకు ప్రభావం చూపడం వల్ల విద్యార్థులు చెడు మార్గాన్ని పెంచుకుంటూ పక్కదారి పడుతున్నట్లు తెలుస్తుం ది.

జిల్లా అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు ముందుగానే అక్క డ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్క డ పనిచేసే సిబ్బంది ఏ లోపం లేకుండా అన్ని చెక్క దిద్ది పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇటీవలే నిర్మల్ జిల్లాలో సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హాస్టల్ బాట కార్యక్రమాన్ని నిర్వహించి హాస్టల్లో ఉం టున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు మౌలిక సదుపాయాలపై జిల్లా అధికారులకు వినతి పత్రం అందించిన వాటిని పరిష్కరించడం లేదని విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు పేర్కొంటున్నారు

ప్రభుత్వపరంగా ఇబ్బందులే

సంక్షేమ హాస్టల నిర్వహణ విషయంలో ప్రభుత్వ పరంగా కూడా కొన్ని లోపాలను ఉండడంతో విద్యార్థులు హాస్టల్ వార్డెన్లు ఇబ్బందులు పాలవుతున్నారు. హాస్టల్లో మౌలిక సదుపాల కల్పనకు ప్రభుత్వం తగిన నిధులు ఖర్చు చేయకపోవడం ప్రతినెల చెల్లించే మెనూ చార్జీలు చెల్లించకపోవడంతో హాస్టల్ బార్డర్లు అప్పులు తెచ్చి విద్యార్థులకు భోజనం ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు కొన్ని హాస్టల్లు అద్దెపములను నిర్వ హించడం వల్ల ప్రభుత్వం అద్దె చెల్లింపు పెండింగ్‌లో ఉండడంతో హాస్టల్ భవన యజమానులు భవనాలను ఖాళీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

చాలా సమస్యలు ఉన్నాయి

జిల్లాలోని వివిధ సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ప్ర భుత్వ మౌలిక సదుపాయాలు కల్పిం చకపోవడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు సరిపడే గదులు ఫ్యాన్లు లేకపోగా మూత్రశాలలు మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడంతో ఇబ్బంది గురవుతున్నారు. హాస్టల్‌కు సరఫరా చేసే కూర గాయలు గుడ్లు కూడా నాణ్యతగా ఉండడం లేదని కాం టాక్ట్‌లతో కొం దరు కుమ్మక్కై నాసిరకం వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

 ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు

వార్డెన్లు బాధ్యతరహితంగా ప్రవర్తిస్తున్నారు

జిల్లాలో ఏ వార్డెన్ కూడా స్థానికంగా ఉండి విధు లు నిర్వహించడం లేదు. హాస్టల్లో కాం ట్రాక్టు ఉద్యోగులదే పెత్తనం పర్యవేక్షణ లేక విద్యార్థుల్లో క్రమశిక్షణ కొరవడుతుంది. దానికి నిదర్శనం ఇటీవల జరిగిన సంఘటనలే. విద్యార్థులు ఏమి చేస్తున్నారు, ఏమి తింటున్నారు అనేది రాత్రింబగళ్లు పర్యవేక్షించాల్సిన సంక్షేమ అధి కారులు నిర్మల్ పట్టణం నుం చి రాకపోకలు కొనసాగించడం శోచనీయం.

 రాజేష్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి, ఖానాపూర్