calender_icon.png 4 July, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు

04-07-2025 12:51:04 AM

- మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్‌నగర్, జూలై 3 (విజయక్రాంతి): ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. గురువారం కేంద్రంలోని పార్టీ కార్యాలయంలోబీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు క్యామ మల్లేశంని మాజీ మం త్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు సన్మానించారు. సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని ఎక్కడికి వెళ్లిన ప్రజలు చెప్తున్నారని తెలిపారు. మల్ల బీఆర్‌ఎస్ అధికారం లోకి వస్తుందని ప్రజలే చెబుతున్నారని పేర్కొన్నారు.

అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఏ ఎన్నికలు వచ్చిన మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికల తరువాత యి ప్పుడు అమలు చేస్తున్న ఒకటి.. రెండు స్కీంలు కూడా నిలిపివేస్తారని తెలిపారు. జరగనున్న ఎన్నికల్లో నాయకులు అందరూ సమన్వయముతో పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సిములు, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.