calender_icon.png 26 December, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థలాలు చూపించారు.. పట్టాలు ఇచ్చారు..

26-12-2025 12:00:00 AM

  1. ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి- ఇంటి నెంబర్లు మరిచారు!
  2. తుమ్మల యుగంధర్ తో బాధితుల గోడు

ఖమ్మం , డిసెంబర్ 25 (విజయ క్రాంతి) : మాకు స్థలాలు చూపించారు, పట్టాలు ఇచ్చారు, ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి, కానీ ఇంటి నెంబర్లూ మాత్రం కేటాయించడం లేదు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అంటూ పువ్వాడ ఉదయ్ నగర్ కాలని బాధితులు గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు , తుమ్మల యుగంధర్ ను కలిసి, తమ గోడు వెల బుచ్చుకున్నారు.

ఈ సందర్భంగావీరనారి మహిళల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి మాట్లాడుతూ 2004 , 2009 లో పువ్వాడ ఉదయ్ కాలని లో పేదలకు ,ప్రభు త్వ భూమిగా గుర్తించి192 సర్వే లోఇళ్ల స్థలాలు వాటితో పాటు పట్టాలు కూడా కేటాయించారని తెలిపారు. 58 జీ వో కిందా క్రమ బద్దకరించారని , ఈ నిరుపేద లు ఇళ్లు నిర్మించు కోవడం తో పాటు నివసించడం ప్రారంభించారనితెలిపారు.

ఈనేపధ్యం లో ఇంటినెంబర్ల కు గాను పలు దఫాలు గా పంచాయితీ కార్య దర్శి కి దరఖాస్తులు చేసు కొన్నా ఫలితం కన్పించ లేదు. ఇప్పటి వరకూ ఇంటినెంబరు రాలేదని వివరించారు. ఖమ్మం నగరం లో నివాసం ఉంటున్న కుమారి అనే మహిళ పువ్వాడ ఉదయ్ నగర్ కాలనీలో 192 సర్వే నెంబర్ లోగల ప్రభుత్వానికి చెందిన 300 గజాల స్థలాన్ని ఆక్రమించుకున్నదని భూక్యా ఉపేంద్ర బాయి ఆరోపించారు. పైగా ఆ ఖాళి స్థలానికి ఇంటి నెంబర్ కూడా కేటాయించారన్నారు.  ఈ విషయం లో తగిన న్యాయం చేకూర్చాలని కోరారు.

సదరు మహిళ ఈ నిరుపేద లబ్ధిదారులకు ఈ స్థలం తనదేనంటూ నోటీసులు పంపుతూ బ్రాంతులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమెపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు .  వెంటనే కబ్జా అయిన ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీన పరుచుకునేలా చూడాలని , అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో బాధితు లు జోగు భాగ్యమ్మ , బత్తుల సుభద్ర , ఓర్సు రంగమ్మ , కాస బోయిన అలి వేలు మంగమ్మ , బత్తుల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.