calender_icon.png 25 December, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదో లొల్లి..!

25-12-2025 12:21:09 AM

కలెక్టర్ కు కాంగ్రెస్ నేతల పిర్యాదు

కరీంనగర్, డిసెంబర్24(విజయక్రాంతి): జిల్లాలో తరచూప్రోటోకాల్ వివాదం తెరమీదికి వస్తుండటంతో అధికారుల తీరుపై అధి కార పార్టీ నేతలు గుర్రుమంటున్నారు.కరింనగర్ సి ఎస్ ఐ చర్చిలో అధికారికంగా జరి గిన క్రిస్మస్ వేడుకలల్లోకవ్వంపల్లి సత్యనారాయణ ఫోటోను విస్మరించడం వివాదానికి దారితీసింది.ప్రోటోకాల్ పాటించకపోవడం దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమే అంటూజిల్లా గ్రంధాలయ చైర్మన్ సత్తు మల్లేష్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొ రివి అరుణ్ కుమార్ లు బుధవారంకలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. కరీంనగర్ సి.ఎస్.ఐ ప్రాంగణంలో క్రిస్మ స్ వేడుకలు ఘనంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నగర ప్రతినిధులను కలుపుకొని సంబంధిత అధికారులు కార్యక్రమా న్ని సమన్వయం చేసే ప్రయత్నం చేసారు కాని ఈ కార్యక్రమానికి సంబంధించి విడుదలైన ఫోటోలు మరియు సమాచారంలో మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి స త్యనారాయణ ఫోటోను వారి పాల్గొనడాన్ని పూర్తిగా విస్మరించారు.

ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు ఇటీవల జరిగిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మానకొండూర్ నియోజకవర్గం7వ వార్డు పరిది లో జరిగింది.కార్యక్రమం అంశాలు అధికారిక ఫోటోలు, సమాచారంలో కవ్వంపల్లి పేరును పొందుపరచలేదు. ఉన్నత విద్యావంతుడు, గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న, ఒక దళిత ప్రజాప్రతినిదిని విస్మరించడం వల్ల దళిత సంఘాల నుండి విమర్శలు వస్తున్నాయి. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా సా మాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని ఇలా వ్యవహరిస్తుందా అనే సందేహాలు ప్ర జల్లో వ్యక్తమవుతున్నాయి.

ప్రజాస్వామ్య వ్య వస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడం అ త్యంత అవసరం అని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుం డా జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో దళితుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవలసి వస్తుందని కాంగ్రెస్ ఎస్ సి సెల్ నేతలు హెచ్చరించారు.