25-12-2025 12:20:29 AM
నారాయణఖేడ్, డిసెంబర్ 24: నారాయణఖేడ్ పట్టణంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై హత్యకాండను నిరసిస్తూ బజరంగ్దళ్ పరిషత్ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీని చేపట్టారు ఈ సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులకు భారతదేశంలో అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ప్రతి భారతీయుడు హిందువులపై జరుగుతున్న దాడులను హత్యలను ఖండించాలని అన్నారు.
ద్విపుదాస్ మున్షి నీ అత్యంత దారుణంగా హతమార్చడం ప్రపంచంలోని యావత్ హిందూ సమాజానికి సిగ్గుచేటని అన్నారు. దేశంలోనే నాయకులు సంఘాలు పార్టీలకతీతంగా ఇలాంటి క్రూరమైన చెల్లెలు ఖండించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆపకపోతే బంగ్లాదేశ్ పై యుద్ధం ప్రకటించాలని వారు ప్రధానిని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో హిందూ సంఘా ల నాయకులు రజినీకాంత్, ప్రశాంత్, అశోక్ యాదవ్, సురేష్, సాయిరాం, సతీష్, ప్రవీణ్, రవికుమార్, సతీష్ యాదవ్, ఓం ప్రకాష్, పూసల విజయ్, భూస అశోక్, గౌలి సంతోష్, మాణిక్ , జగన్నాథ్, రాజు గౌడ్ పూసల అంబాదాస్, శ్రీనివాస్, రుద్రారం వీరప్ప, పాల్గొన్నారు.