calender_icon.png 18 November, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామానుజన్ గణిత ఒలింపియాడ్ 2024లో సత్తా చాటిన జయ

17-11-2025 10:13:44 PM

సూర్యాపేట (విజయక్రాంతి): రామానుజన్‌ గణిత అకాడమి రామచంద్రాపురం వారు నిర్వహించిన గణిత ఒలంపియాడ్‌ లో జయ స్కూల్ సూర్యాపేట నుండి 69 మంది విద్యార్థులు రెండవ లెవెల్‌ కు అర్హత సాధించారని కరస్పాండెంట్ జయవేణుగోపాల్‌ తెలిపారు. 5వ తరగతి నుండి 12 మంది విద్యార్థులు, 6వ తరగతి నుండి 8 మంది విద్యార్థులు, 7వ తరగతి నుండి 10 మంది విద్యార్థులు, 8వ తరగతి నుండి 12 మంది విద్యార్థులు, 9వ తరగతి నుండి 12 మంది విద్యార్థులు, 10వ తరగతి నుండి 15 మంది విద్యార్థులు అర్హత సాధించారని అన్నారు.

పాఠశాలలో గణితం పై నిర్వహించే  వివిధ కార్యక్రమాలు, వర్క్‌ షాపులు అత్యుత్తమ ప్రోగ్రామ్‌ ద్వారా టాలెంట్ టెస్టులలో విజయం సాధిస్తున్నారని తెలిపారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను, తోడ్పడిన తమ ఉపాధ్యాయ బృందాన్ని కరస్పాండెంట్‌ జయ వేణుగోపాల్‌, డైరెక్టర్లు జెల్లా పద్మ బింగి జ్యోతి లు అభినందించారు. తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు వారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.