calender_icon.png 18 November, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవి అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు

17-11-2025 10:11:38 PM

నెమలి అనిల్ కుమార్..

ఉప్పల్ (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపచేసిన గొప్ప యోధుడు అందెశ్రీ అని గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ అన్నారు. మల్లాపూర్ డివిజన్ నాగలక్ష్మి నగర్ కాలనీలోని శ్రీ సాయి విద్యానికేతన్ హై స్కూల్లో దళితరత్న డా.పి జి సుదర్శన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అందెశ్రీ సంస్మరణ సభలో నెమలి అనిల్ కుమార్ పాల్గొని అందెశ్రీకి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కట్ట నాగరాజ్ అనంత రామ్ CH.మల్లేష్ సాయి సర్ రంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.