calender_icon.png 27 January, 2026 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఇలా..

07-01-2025 12:00:00 AM

పిల్లలు ఇంటి పనులు చేయాలా వద్దా? చాలామంది తల్లిదండ్రులు విభిన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ నిపుణుల సలహా ప్రకారం.. పిల్లలు ఖచ్చితంగా ఇంటి పనిని చేయనివ్వాలి. ఎందుకంటే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటి పనులు చేయించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఇంటి పనులు చేసే అలవాటు పిల్లల విశ్వాసాన్ని పెంచుతుంది. ఏదైనా చేయగలమనే ఆత్మవిశ్వాసం వారిలో కలుగుతుంది. ఇది కుటుంబం,  ఇంటి సహకారాన్ని కూడా పెంచుతుంది. దాంతో పిల్లలు బాధ్యతగా వహిస్తారు. ఉదాహరణకు బట్టలు సర్దుకోవడం, మొక్కలకు నీరు పట్టడం, భోజనం తర్వాత పాత్రలు తీయడం, టేబుల్‌ను శుభ్రం చేయడం లాంటి పనులు నేర్పించాలి. ఫలితంగా తల్లిదండ్రులు, పిల్లల మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. అలాగే మంచి సమన్వయం ఏర్పడేలా చేస్తుంది.